భారత దేశంలో విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ ప్రస్తుతం రాజకీయాలపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన 2013 లో తెరకెక్కించిన ‘విశ్వరూపం’ చిత్రం సీక్వెల్ ‘విశ్వరూపం 2’ ఈ నెల 10 న రిలీజ్ అయ్యింది. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని ఆర్థిక కారణాల వల్ల ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.  ఎట్టకేలకు అన్ని కష్టాలు అధిగమించి తాను దర్శకత్వం వహించి, నిర్మించిన ‘విశ్వరూపం2’ థియేటర్లలో రిలీజ్ చేశారు. 
Image result for విశ్వరూపం 2
అయితే ఈ చిత్రం కమల్ హాసన్ ఆకఖరి చిత్రం అవుతుందా..లేద మరో చిత్రంతో అలరిస్తారా అన్న విషయం పక్కనబెడితే..అభిమానులు మాత్రం మొదటి రోజు థియేటర్లకు క్యూ కట్టారు.   అయితే ఆ అంచనాలను అందుకోవడంలో.. అభిమానులను అలరించడంలో కమల్ ఫెయిల్ అయ్యాడు. దర్శకుడిగా కమల్ ప్రేక్షకులను నిరాశ పరిచాడు.

తమిళనాట అయితే సోమవారానికే ఈ చిత్రం ఇరవైకోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట.  ఇక బాలీవుడ్ లో మాత్రం ‘విశ్వరూపం 2’ కష్టాలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ విషయంలో అయితే డిస్ట్రిబ్యూటర్లు చేతులు ఎత్తేశారు. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి విశ్వరూపం 2 హిందీ డిష్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు తెచ్చుకున్నారని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: