అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఈరోజు గీతా గోవిందంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా యూఎస్ లోనే 50 రోజులు ఆడిందంటే సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.


పెళ్లిచూపులు తర్వాత వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా విజయ్ లోని నటుడిని అందరికి పరిచయం చేసింది. ఎంచుకున్న పాత్రకి న్యాయం చేయడమే నటుడిగా వారి రోల్ అయితే కొన్నిసార్లు ఆ పాత్ర నిజ జీవితంలో ఇలానే ఉంటుందేమో అనేలా చేస్తారు.


అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఓ మార్క్ వేసుకున్న విజయ్ దేవరకొండా యూత్ లో తన ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే ఈరోజు వచ్చిన గీతా గోవిందంతో మరోసారి అర్జున్ రెడ్డి లాంటి హిట్ అందుకుంటుందా అంటే కష్టమే అని అంటున్నారు. అర్జున్ రెడ్డి ఇమేజ్ తో ఈ సినిమా చూస్తే కష్టమే.. ఇందులో విజయ్ డిఫరెంట్ క్యారక్టరైజేషన్ తో కనిపిస్తాడు. అయితే అలాన్ ఆలోచిస్తే అన్ని సినిమాలు అర్జున్ రెడ్డిలు కాలేవు కదా అని చెప్పొచ్చు.


అర్జున్ రెడ్డి తరహా సబ్జెక్ట్ కాకున్నా ఆ సినిమా కలక్షన్స్ బీట్ చేసేందుకు గీతా గోవిందం ఏమేరకు ప్రభావితం చూపిస్తుందో చూడాలి. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. రిలీజ్ ముందే విపరీతమైన బజ్ ఉన్న ఈ సినిమా అసలు రిజల్ట్ ఏంటన్నది ఈవినింగ్ కల్లా తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: