తెలుగు ఇండస్ట్రీలో తమిళ చిత్రాలు డబ్బింగ్ అవుతున్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా తమిళ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలు తెలుగులో కూడా ఘన విజయం సాధించిన సంఘటనలు ఉన్నాయి. ఆ మద్య స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ‘బాయ్స్’ చిత్రం తెలుగు లో కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో పరిచయం అయిన సిద్దార్థ పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించాడు. 
Image result for hero bharath father
ఇక హీరోయిన జెనీలియా కూడా తెలుగు లో పలు చిత్రాల్లో నటించి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.  ఇక ఈ చిత్రంలో నటించిన తమన్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అయ్యాడు.  ఈ చిత్రంలో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించిన భరత్ తర్వాత ‘ప్రేమిస్తే ’,‘యువసేన’ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించాడు.  ఆ తర్వాత తమిళ, మళియాళ చిత్రాల్లో నటించిన భరత్ ఆ మద్య మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రంలో నటించాడు.
Related image
తాజాగా భరత్ ఇద్దరు కవల పిల్లలకు తండ్రయ్యాడు. భరత్ భార్య జేశ్లీ ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ భరత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఇద్దరు బేబీ బాయ్స్ జన్మించారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని భరత్ తెలిపాడు. ఇటీవల జేశ్లీ గర్భంతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: