తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య చిన్న చిత్రాల జోరు బాగా ఊపందుకుంది.  ఈ నేపథ్యంలో అడవిశేషు నటించిన గూఢచారి మంచి సక్సెస్ సాధించడంతో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన తెనాలి బ్యూటీ మాజీ మిస్ ఇండియా శోభిత ధూళిపాళ కు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. మొదట హిందీ చిత్రంలో నటించిన ఈ అమ్మడు తెలుగు లో ‘గూఢచారి’ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ తెనాలి బ్యూటీ ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది కదా.. అందుకే లిప్ లాకులకు - బోల్డ్ అవతారం లో కనిపించేందుకు పెద్దగా అభ్యంతరాలు లేవని అంటుంది.
Image result for sobhita dhulipala
దాంతో దర్శక, నిర్మాతలు కూడా శోభిత కు ఎక్కువ ఛాన్సులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం శోభిత 'మూతోన్' అనే ఒక మలయాళం - హిందీ బైలింగ్వల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  మలయాళం సెన్సేషనల్ హీరో నివిన్ పౌలి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా శోభిత ఒక సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తుందట.
Image result for sobhita dhulipala
అయితే సెక్స్ వర్కర్ పాత్ర అంటే ఛాలెంజింగ్ గా ఉంటుందని..గతంలో సీనియర్స్ నటన చూసి కొంత జ్ఞానం సంపాదించాలని అంటుంది. ఈసారి మలయాళం సినిమాలో  క్లిష్టమైన పాత్రను పోషించేందుకు ప్రిపరేషన్ కూడా గట్టిగానే చేస్తోందట.  మరి ఈ పాత్రతో అందరి దృష్టిని ఆకర్షిస్తుందేమో వేచి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: