చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా మూవీ మీద ఇప్పటికే అంచనాలు తారా స్థాయికి చేరినాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అందరినీ కట్టి పడేసింది అయితే ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు. మ‌రో ఐదు రోజుల్లో సైరా టీజ‌ర్ షురూ అవుతోంది. మెగాస్టార్ పుట్టిన రోజు  ఆగ‌స్టు 22 సంద‌ర్భంగా సైరా టీజ‌ర్ ఖుషీ చేయ‌నుంది. అందుకు ముహూర్తం  పెట్టేసారు. స‌రిగ్గా ఆగ‌స్ట్ 21 న  ఉద‌యం  11.30 నిమిషాల‌కు టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు.

Image result for sairaa

చిరు పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగా టీజ‌ర్ రిలీజ్ అవుతుంది. అందుకు కార‌ణం  లేక‌పోలేదు. స్వాతం త్ర్య స‌మ‌ర‌యోధుడి క‌థ కాబ‌ట్టి…చిరు జ‌న్మించిన  రోజున రిలీజ్ చేస్తే భావ్యం కాదు. అందుకే  ముందుగా ఆవిష్క‌ర‌ణ పెట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. మోష‌న్ పోస్ల‌ర్ తోనే ఓ రేంజ్ లో అంచ‌నాలు పెంచేసిన సైరా.. టీజ‌ర్ తో ఎక్స‌ప‌క్టేష‌న్స్ ను  అంత‌కంత‌కు రెట్టింపు చేయ‌డం ప‌క్కా. అమిత్ త్రివేది అదిరిపోయే రేంజ్ లోబి.జీఎమ్ కంపోజ్ చేసిన‌ట్లు స‌మాచారం.

Image result for sairaa

థ‌మ‌న్ అందించిన  మోష‌న్ పోస్ట‌ర్ బ్యాక్ గ్రౌండ్ కన్నా ఓ రేంజ్ లో  ఉంటుంద‌ని  యూనిట్ వ‌ర్గాలు రివీల్ చేసాయి. అర్ధ‌రాత్రి రిలీజ్ కాబ‌ట్టి మెగా అభిమానుల హ‌డావుడి  ఉండ‌దు. ఆ మ‌రుస‌టి రోజున అభిమానుల స‌మ‌క్షంలో చిరు  పుట్టిన రోజు వేడుక‌లు జుపుకోనున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు, టీజ‌ర్ ను రాజ‌మౌళి చేతుల మీదుగా మ‌ళ్లీ లాంచ్ చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: