మెగా అభిమానులలో మెగా బ్రదర్ నాగబాబుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అతడు చిరంజీవి పవన్ కళ్యాణ్ లులా పెద్ద స్టార్ కాకపోయినా వారితో సమానంగా నాగబాబును కూడా మెగా అభిమానులు ఆదరిస్తారు. భారీ సినిమాల నిర్మాతగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన నాగబాబు ఆప్రయత్నాలు కలిసి రాకపోవడంతో బుల్లితెర పై తన హవా కొనసాగిస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా సినిమాలు చేస్తూ తన ఇమేజ్ ని నిలబెట్టుకుంటున్నాడు.
Naga Babu
ఇలాంటి పరిస్థుతులలో నిన్న విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన నాగబాబు పాత్రకు వేరే వ్యక్తి చేత డబ్బింగ్ చెప్పించడం షాకింగ్ గా మారింది. గతంలో నాగబాబు నటించిన ఏసినిమాలోను వేరే వ్యక్తి చేత డబ్బింగ్ చెప్పించలేదు.  ‘గీత గోవిందం’ లో నాగబాబు పాత్ర తొలి డైలాగ్ విన్నపుడే వాయిస్ ఏదో తేడాగా ఉందే అన్న అనుమానం అందరిలో కలిగింది. 
Nagababu Press Meet on Sri Reddy Controversy - Sakshi
అయితే కాసేపటికి ఆ వాయస్ నాగాబాబుది కాదని వేరే వ్యక్తి చేత డబ్బింగ్ చెప్పించారని స్పష్టమైపోయింది. గత కొంత కాలంగా బుల్లితెరను షేక్ చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమంలో నాగబాబు గొంతు విన్నవారికి కూడ కొంత తేడా కనిపించింది. నాగబాబుకు ఎదో గొంతు సంబంధిత ఇన్ ఫెక్షన్ వచ్చిందని భావించారు అంతా. అయితే వారాలు గడుస్తున్నా నాగబాబు గొంతు అదేవిధంగా కొనసాగడంతో పాటు ఇప్పుడు ఏకంగా నాగబాబు పాత్రకు వేరే వ్యక్తి చేత డబ్బింగ్ చెప్పించడంతో నాగబాబుకు ఏమైంది అంటూ వార్తల హడావిడి మొదలైంది. 
Actor Naga Babu signed on to play Jr NTR’s father in Aravindha Sametha
తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం నాగబాబు వాయిస్ సరిగ్గా పనిచేయడం లేదని ఈమధ్య అసలు మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు అంటూ వార్తలు హడావిడి చేస్తున్నాయి. మరీ ఇన్ని నెలల పాటు గొంతు బొంగురు పోయి ఇప్పుడీ స్థాయికి చేరుకుందంటే సమస్య కొంచెం తీవ్రమైందే అని గాసిప్పులు బయటకు వస్తున్నాయి. ఈసమస్యల నుండి బయటకు రావడానికి నాగబాబు సర్జరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: