నిన్న రిలీజ్ అయ్యి యూత్ అందరిని ఎంటర్టైన్ చేస్తూ అలరిస్తున్న గీతా గోవిందం మూవీ సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటించిన ఈ సినిమా రివ్యూయర్స్ కూడా మంచి రేటింగులు ఇచ్చారు. కథ రొటీన్ గా అనిపించినా కథనం ఎంటర్టైన్ చేసింది. అందుకే గీతా గోవిందం అందరికి నచ్చింది. 


అంతేకాదు విజయ్ ను అర్జున్ రెడ్డిగా చూసిన ఆడియెన్స్ దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే రోల్ లో చూసి షాక్ అవుతున్నారు. పరశురాం అసలు ఈ సినిమా కథను విజయ్ కోసం అనుకోలేదట. శ్రీరస్తు శుభమస్తు సినిమా కన్నా ముందే ఈ సినిమా ఓకే చేశారట. కాని మధ్యలో శ్రీరస్తు శుభమస్తు కథ చెప్పి గీతా బ్యానర్ లో హిట్ కొట్టాడు. 


గీతా గోవిందం కథ నాని, శర్వా కాదన్నారట. అక్కినేని హీరో నాగ చైతన్య కూడా గీతా గోవిందం కథను వద్దన్నాడట. రొటీన్ కథ అని వారికి అనిపించింది అనుకుంటా అందుకే వారు లైట్ తీసుకున్నారు. కాని పరశురాం ఆ కథనే ఇంత అందంగా ఎంటర్టైనింగ్ గా చెప్పగలుగుతాడని ఊహించలేకపోయారు.


ఫైనల్ గా గీత గోవిందం విజయ్ ఖాతాలో మరో బంపర్ హిట్ తెచ్చిపెట్టింది. సినిమా కలక్షన్స్ కూడా బాగున్నాయి. కచ్చితంగా ఈ సినిమా మిస్సైన హీరోలు మాత్రం ఈ హిట్ చూసి మరోసారి స్టోరీ ఎంపిక చేసుకోవడంలో ఆలోచన చేస్తారని చెప్పొచ్చు. విజయ్ గట్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: