Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 6:24 pm IST

Menu &Sections

Search

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నాపై దిల్ రాజు దుష్ప్రచారానికి కారణం ఏమై ఉంటుందబ్బా?

అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నాపై దిల్ రాజు దుష్ప్రచారానికి కారణం ఏమై ఉంటుందబ్బా?
అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నాపై దిల్ రాజు దుష్ప్రచారానికి కారణం ఏమై ఉంటుందబ్బా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చిత్ర వర్ణాల చిత్ర విచిత్ర ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఈ చదరంగంలో ఎవరు ఏ ఎత్తుకు పైయెత్తు వేస్తారో చెప్పలేం. చిత్ర పరిశ్రమ ఒకసారి ఒకరిని నెత్తిన పెట్టుకుని పూజిస్తుంది. ఇంకోసారి వారినే పూర్తిగా కిందికి దించి పాదాలతో తొక్కేస్తుంది. గతకాలంలో ఎందరినో ఏవో కారణాలతో నిట్టనిలువున పాతాళానికి తొక్కేసిన సందర్భాలున్నాయి. 


ఇందుకు కథానాయకులు మాత్రమే కాదు కథానాయికలు కూడా ఏమాత్రం అతీతులు కాదు. పరిశ్రమ పెద్దలకు ఫేవర్ చేయకపోయినా, ఫర్ఫార్మన్స్ చేయక పోయినా,  హిట్టు రాకపోయినా, తొలి నింద పడేది కథానాయిక పైనే. ఆ ప్రమాధాన్ని ఎదుర్కోవాల్సింది తరచుగా కథానాయికలే. ఈ విధమైన నిందాపనిందలకు కారణం భిన్న పార్శ్వా ల్లో భిన్న విభిన్న కోణాల్లో ఉంటుంది. ఉదాహరణగా ఈ మద్య కాలంలో నటీమణి రాశీ ఖన్నాపై కొనసాగుతున్న ప్రచారం చూస్తుంటే ఇలాంటి సందేహాలు గమనించే వారికి కలగకుండా ఉండవు.
tollywood-news-rashi-khanna-dil-raju-whether-raju-
2014 లో "ఊహలు గుసగుసలాడే" సినిమాతో అనూహ్య విజయం అందుకుని, ఆపై పలు క్రేజీ చిత్రాల్లో కథానాయకిగా అనేకమంది యువ, వర్ధమాన కథానాయకులతోను అద్భుతంగా నటించిన రాశీ ఖన్నా నాలుగేళ్ళ తరవాత కూడా కెరీర్ పరమైన సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్లు కనిపిస్తుంది.  హిట్టును మాత్రమే పరిగణన లోకి తీసుకొని దాన్ని మాత్రమే నమ్మే పరిశ్రమలో - ఒకవేళ  ఖర్మకాలి ఆ హిట్టు ముఖం చాటేస్తే ఆ వైఫల్యంలో భాగస్వామ్యాన్ని ఎక్కువగా హీరోయిన్ ను తప్పకుండా వేలెత్తి చూపిస్తారు. ప్రస్తుతం రాశీ అలాంటి దశలోనే ఉందా? అన్న సందేహాలు కలగక మానవు.  


రీసెంట్ గా సినిమా రంగం నుండి గుప్పుమనే గాసిప్పుల్లో రాశీ పై పుడుతున్న పుకార్ల స్థాయి ఒక రేంజులో ఉన్నాయి. "తొలి ప్రేమ" సినిమాతో విజయం ఖాతాలో వేసుకున్న రాశికి దశ తిరిగింది అని అనుకుంటున్న సమయంలో "శ్రీనివాసకళ్యాణం" వైఫల్యం రాశీపై ధారుణ దుష్ప్రచారానికి కారణమవుతోందన్న సందేహాలు వెల్లడౌతున్నాయి. 


చిత్రపురి కథనాల ప్రకారం రాశీ ఖన్నాకు నిర్మాత దిల్ రాజుతో విభేధాలు రాజుకున్నాయని రాశిని హీరోయిన్ గా తీసుకోవద్దని 'దిల్ రాజు' ఇతర నిర్మాతలకు ఫోన్ చేయించి మరీ చెపుతున్నారని ప్రచారం సాగుతోందని ఫిల్మ్ నగర్ న్యూస్.మరోవైపు ఎన్టీఆర్ చిత్రంలో జయప్రద పాత్రను ఆఫర్ చేస్తే రాశీ ఇంకా ఆలోచిస్తోందని - ఒక పాట ఒక సీన్ కే పరిమితమయ్యే రోల్ కావడం తో ఇలా చేస్తోందని మరో ప్రచారం కూడా ఉంది.  అయితే ఈ ప్రచారాల్లో నిజం ఎంత? అబద్ధమెంత? అన్నది వారిద్ధరిలో ఎవరైనా చెపితే తప్ప తెలియదు. టాలీవుడ్ కేంద్రమైన హైదరాబాద్ లో సెటిలైన రాశీ టాలీవుడ్ కెరీర్ ని పెద్ద రేంజులో ఆశిస్తోంది. ఇలాంటి వేళ ఈ ప్రచారం తనకు ఇబ్బందికరమనడంలో సందేహం లేదు.


అయితే దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది కొత్త హీరో హీరోయిన్లకు అవకాశమిచ్చిన వ్యక్తి. సాధారణంగా యువ హీరో హీరోయిన్లతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు భయపడిన దాఖలాలు ఉన్నాయి. అయితే అలాంటి కొత్త నటీ నటులతో సినిమాలు తీసి వారిని పరిశ్రమలో నిలబెట్టారు దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నాకు అవకాశాలు ఇచ్చి ఆమెను అగ్రహీరోయిన్ వరుసకు చేర్చిందీ కూడా దిల్ రాజే. 
 

తాజాగా దిల్ రాజు నిర్మాతగా చిత్రీకరించిన శ్రీనివాస కళ్యాణం సినిమా విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా తెలుగు కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమా కథను దిల్ రాజు హీరోయిన్ రాశీ ఖన్నాకు వివరించినప్పుడు చాలా బాగుందని చెప్పిందట. అయితే రెమ్యునరేషన్ కాస్త తగ్గించుకోవాలని రాశీఖన్నాను దిల్ రాజు కోరారట. అయితే అందుకు రాశీ ఖన్నా ఏమాత్రం ఒప్పుకోలేదట. 
 

దీంతో రాశీ ఖన్నాపై ఆగ్రహించిన దిల్ రాజు సినిమా పూర్తయిన తరువాత ఆమె తో ఎవరూ సినిమాలు తీయవద్దని నిర్మాతలకు స్వయంగా ఫోన్లు చేసి చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కాస్తా రాశీ ఖన్నా కు తెలిసి దిల్ రాజును కలిసేందుకు ప్రయత్నించగా, దిల్ రాజు ఆమెకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్న ప్రచారం సినీ పరిశ్రమలో ముమ్మరంగా జరుగుతోంది. దిల్ రాజు పిచుక మీద బ్రహ్మాస్త్రం వేస్తాడా? ఎమో   ఊహలు గుసగుస లాటైతే ఫర్వాలేదు. నిజమైతే రాశీ ఖన్నా కు కష్టాలే. 

tollywood-news-rashi-khanna-dil-raju-whether-raju-

tollywood-news-rashi-khanna-dil-raju-whether-raju-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నేరస్తుడిగా నిర్దారణ కాకముందే ముద్ధాయిని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించలేం: సుప్రీం
దీదీ మమత పాలనలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే కుప్ప కూలిన మూడు ఫ్లైఓవర్లు
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
About the author