యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అరవింద సమేత వీర రాఘవ. ఫ్యాక్సన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సంచలనం సృష్టించిన ఈ సినిమా టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. 


కంటబడ్డవా.. కనికరిస్తానేమో అంటూ రికార్డులను కనికరం లేకుండా వాటి అంతకు చూస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా టీజర్ తో సినిమా లెక్క ఏంటో చూపించిన త్రివిక్రం పక్కా నందమూరి ఫ్యాన్స్ కు మంచి ఫుల్ మీల్స్ పెట్టే సినిమాగా ఇది ఉంటుందని రుచి చూపించాడు.   


ఇక ఈ సినిమా టీజర్ నిన్న ఉదయం 9 గంటలకు రిలీజ్ అవగా 24 గంటల్లో టాప్ ట్రెండింగ్ లో ఉంటూ ఒక్కరోజులో ఏకంగా 6 మిలియన్స్ అంటే 60 లక్షల వ్యూస్ తో రికార్డుల ఊచకోత కోసింది. ఎన్.టి.ఆర్ విధ్వంసానికి ఇదో నిరదర్శనమని చెప్పొచ్చు. 60 లక్షల వ్యూస్ తో సినిమా దమ్ము చూపించాడు తారక్.   


తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కు సిద్ధమవుతుంది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ సినిమా ఎలా ఉండాలో ఆ సమీకరణాలకు ఏమాత్రం తగ్గకుండా అంచనాలు కలిగిస్తుంది సినిమా అరవింద సమేత. మరి టీజర్ తో మొదలైన ఈ రికార్డుల పరంపర రిలీజ్ తర్వాత కూడా కొనసాగించేలా ఉంటుందేమో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: