యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఆ అంచనాలకు తగినట్టుగానే వస్తుంది అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులను సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా టీజర్ లో సునీల్ కూడా ఉన్నాడు. అదేంటి టీజర్ లో సునీల్ ఎక్కడ కనిపించలేదు కదా మరి ఎక్కడ కనిపించాడు అంటే.. ఎన్.టి.ఆర్ డైలాగ్ చెప్పే టైం లో రెడ్ టీ షర్ట్ తో ఉంది సునీలే. 


అతన్ని బ్లర్ చేశారు కదా అయినా అతను సునీలే అని గ్యారెంటీ ఏంటి అంటే.. టీజర్ ను క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే సరిగ్గా ఎన్.టి.ఆర్ డైలాగ్ చెప్పడానికి ముందు ఎన్.టి.ఆర్ పల్టీ కొడతాడు కదా ఆ టైం లో పాస్ పెట్టి చూస్తే ఎన్.టి.ఆర్ తో పాటుగా సునీల్ కూడా కనిపిస్తాడు. 


అరవింద సమేతలో సునీల్ ఉన్నాడని వార్తలు రాగా ఎలాంటి రోల్ చేస్తున్నాడు అన్నది తెలియలేదు. ఎన్.టి.ఆర్ ఫ్రెండ్ పాత్రలో సునీల్ కనిపిస్తున్నాడని టీజర్ లో చూసి తెలుసుకోవచ్చు. చైర్ పై పల్టీ కొట్టగానే సునీల్ కాస్త వెనక్కి జరుగుతాడు. సునీల్ కు ఈ అరవింద సమేత లక్ కలిసి వస్తుందేమో చూడాలి.


అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం చేస్తున్న అరవైంద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: