టాలీవుడ్ లో ఈ మద్య పైరసీలు, లీకేజీలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దర్శక, నిర్మాతలు.  గతంలో పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి పదిరోజుల ముందే నెట్ లో ప్రత్యక్షం కావడం పెను కలకలం సృష్టించింది.  కానీ అదృష్టం కొద్ది ఆ సినిమా సూపర్ హిట్ కావడం మంచి కలెక్షన్లు రాబట్టడంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ లో పడ్డారు.  ఇప్పుడు దేవరకొండ విజయ్ నటించిన ‘గీతాగోవిందం’ పరిస్థితి కూడా అలాగే మారింది.  రిలీజ్ కి ఐదు రోజుల ముందు ఈ సినిమాలో కొన్ని సీన్లు లీక్ కావడంతో చిత్ర యూనిట్ కంగారు పడ్డారు. 

అయితే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. నిన్న స్వాతంత్ర దినోత్సవం కానుకగా రిలీజ్ అయిన ‘గీతాగోవిందం’ పాజిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే రాబడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత అందుకు పూర్తి విరుద్ధమైన గెటప్‌లో విజయ్ కనిపించిన ఈ సినిమాకు ప్రశంసలే కాదు కలెక్షన్లు కూడా బాగున్నాయి. ఇక్కడి మార్కెట్లోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ గోవిందుడు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాడు.
geetha govindam touches half million dollar mark in overseas
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా మంగళవారం రోజే 4 లక్షల డాలర్లను గీత గోవిందం రాబట్టింది. బుధవారం నాటికి ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. పరశురాం డైరెక్షన్‌కు విజయ్, రష్మిక నటన తోడవడంతో.. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలు కూడా మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: