ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ విన్నా విజయ్ దేవరకొండ గురించి మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇతడి అభిమానులు కూడ మరింత రెచ్చిపోయి విజయ్ దేవరకొండ కటౌట్లకు  పాలాభిషేకం చేసినట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో విజయ్ దేవరకొండ మ్యానియా పవన్ కళ్యాణ్ మ్యానియాకు సమానంగా చేరుకుంటుందా అన్న విషయమై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 
Vijay Devarakonda
‘గీత గోవిందం’ స్పెషల్ షోను మెగా స్టార్ చిరంజీవి కోసం మొన్న ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. ఈ షోకు వచ్చిన చిరంజీవి విజయ్ దేవరకొండ పై విపరీతంగా పొగడ్తల వర్షం కురిపించాడు. అంతేకాదు చిరంజీవి విజయ్ దేవరకొండను అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. 
Vijay Devarakonda Overconfidence Again
చిరంజీవి పొగడ్తలకు పొంగిపోయి విజయగర్వంతో చిరంజీవి వంక చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ పై ఇప్పుడు మెగా అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. చిరంజీవి లాంటి మెగా స్టార్ పొగడ్తల వర్షం కురిపించినప్పుడు ఒక సమఉజ్జీలా చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చిరంజీవికి పాద నమస్కారం చేసి ఉంటే విజయ్ గౌరవం మరింత పెరిగేది కదా అంటూ మెగా అభిమానులు విజయ్ దేవరకొండ పై కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే తాను జీవితంలో ఎటువంటి నటన చేయనని అది చూసేవారికి తనకు ఇగో ఎక్కువా అనిపించినా తాను లెక్క చేయనని ఇప్పటికే విజయ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్బాలు తెలిసినవే. దీనితో మెగా అభిమానుల సెటైర్లను విజయ్ ఏమాత్రం పట్టించుకోడు అన్నది వాస్తవం. గతంలో ఏ యంగ్ హీరోకి ఇవ్వనంత ప్రాముఖ్యత ఇప్పుడు మెగా ఫ్యామిలీ విజయ్ కు ఇవ్వడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఇది చాలదు అన్నట్లుగా అల్లు అరవింద్ రేపు ‘గీత గోవిందం’ యూనిట్ సభ్యులకు ఒక ప్రత్యేకమైన డిన్నర్ పార్టీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డిన్నర్ కు చిరంజీవి ప్రత్యేక అతిధిగా రాబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో విజయ్ కు ఇంత ప్రాముఖ్యత మెగా ఫ్యామిలీ ఎందుకు ఇస్తోంది అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది..    


మరింత సమాచారం తెలుసుకోండి: