Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 5:24 pm IST

Menu &Sections

Search

కబాలి దర్శకత్వంలో..సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ!

కబాలి దర్శకత్వంలో..సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ!
కబాలి దర్శకత్వంలో..సిల్క్ స్మిత లైఫ్ స్టోరీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మత్తెక్కించే కళ్లు, నిషా కలిగించే చూపులు, పిచ్చి ఎక్కించే శరీర సౌష్ఠవం, కసి పెంచేలా పెదవిని  కొరుకుతూ కనిపించడం..   ముద్దు ఇచ్చేయాలని తమకంతో డ్యాన్స్ చేస్తూ హీరో ముఖాన్ని దగ్గరగా లాక్కోవడం, బిగికౌగిట బంధించే యత్నం చేయడం నటి సిల్క్ స్మిత ప్రత్యేకతలు.  తెలుగు తెరపై సందడి చేసిన శృంగార తారలలో సిల్క్ స్మిత ఒకరు. అప్పట్లో కుర్రాళ్లంతా ఆమెను మత్తుకళ్ల సుందరిగా పిలుచుకునేవారు. తెలుగు .. తమిళ భాషల్లో కీలకమైన పాత్రల ద్వారా .. ప్రత్యేకమైన గీతాల ద్వారా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.  

silk-smitha-vijayalaxmi-pa-ranjit-silk-smitha-biop

సిల్క్ స్మిత అంటే వెండితెర ర‌థీదేవి అన‌టంలో సందేహం లేదు. కుర్రాడి నుంచి అర‌వైఏళ్ల ముస‌లాళ్ల దాక సినీమా హాల్ల‌కు ర‌ప్పించిన స‌క్సెస్ మంత్రా సిల్క్ స్మితా..! త‌న ఒక్క పాట‌తో సినిమాను మొత్తం సూప‌ర్‌డూప‌ర్ హిట్ చేసిన ట్రాక్ రికార్డ్  స్మిత‌ది. సిల్క్ ఐటమ్ సాంగు చొప్పించి రిలీజ్ చేసి అధిక మొత్తాల‌ను కొల్లగొట్టిన నిర్మాత‌లు చాలామందే ఉన్నారు. అప్ప‌ట్లో సిల్క్ పాట‌లేని సినిమాలు ఊహించ‌లేము. అయితే సిల్క్ చివ‌రి రోజుల‌లో మాత్రం ఆమెను ఆదుకున్న స్టార్ ఒక్క‌రూ లేరు. 

silk-smitha-vijayalaxmi-pa-ranjit-silk-smitha-biop

ఆమె జీవితంలో చివరి రోజుల్లో ఎన్నో కష్టాలు పడింది..కన్నీటి పర్యంతం అయ్యింది..చివరకు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు డిసైడ్ చేశారు.  అప్పట్లో  కొన్ని కథలు ఆమె పాత్ర చుట్టూనే తిరిగాయంటే అప్పట్లో ఆమెకి గల క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిల్క్ స్మిత జీవిత చరిత్రగా 'ది డర్టీ పిక్చర్ ' వచ్చింది. అయితే ఈ సినిమాలో ఆమె  జీవితాన్ని పలు కోణాల్లో ఆవిష్కరించలేదనే విమర్శలు వినిపించాయి. 

silk-smitha-vijayalaxmi-pa-ranjit-silk-smitha-biop

తాజాగా సిల్క్ స్మిత జీవితాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పా రంజిత్ రెడీ అవుతున్నాడు. 'కబాలి' .. 'కాలా' సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన, సిల్క్ స్మిత జీవితాన్ని వెబ్ సిరీస్ గా రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే సిల్క్ స్మిత బాల్యం నుంచి ఆమె సినీ కెరీర్ ఎలా సాగింది..చివరి దశంలో ఆమె జీవితం ఎలా కష్టాలు పడిందన్న విషయాలన్నీ ఇందులో ఉంచబోతున్నాడట పా రంజీత్. ఈ వెబ్ సిరీస్ కి ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నాడట.  


silk-smitha-vijayalaxmi-pa-ranjit-silk-smitha-biop
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ మంత్రికి దిమ్మతిరిగే షాక్!
‘యాత్ర’కు క్లీన్ యూ సర్టిఫికెట్!
ఆ డిస్ట్రిబ్యూటర్ కి నష్టపరిహారం చెల్లించిన నిర్మాత!
డిఫరెంట్ లుక్స్ తో మాధ‌వ‌న్ లుక్ వైరల్!
ఈ చిన్నారికి మీ ఆశిస్సులు ఇవ్వండి : లారెన్స్
రాజకీయాలపై క్లారిటీ ఇచ్చిన అజిత్!
రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?!
మరోసారి విలన్ గా అక్షయ్ కుమార్!
ఆ సినిమాలో ఫోర్న్ స్టార్ గా కనిపించనున్న రమ్మకృష్ణ!
‘మణికర్ణిక’హిట్ కోసం..కుల‌దైవానికి కంగ‌నా పూజ‌లు!
నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం!
ఎమ్మెల్యేగా కనిపించనున్న హాట్ యాంకర్?!
రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఎఫ్ 2’!
ప్రజా సంక్షేమం కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా! : వంటేరు