‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ గా మారడంతో ఈసినిమాకు వస్తున్న భారీ కలెక్షన్స్ తో నిన్నటి నుండే లాభాలలోకి వచ్చేసింది అన్నవార్తలు వస్తున్నాయి. ఈమూవీ వీకెండ్ కలక్షన్స్ ప్రస్తుతం ఎవరి అంచనాలకు అందని స్థాయిలో ఉండటంతో ఈమూవీ అర్జున్ రెడ్డి కలక్షన్స్ ను కేవలం ఈవీకెండ్ తోనే క్రాస్ చేస్తుంది అని అంటున్నారు. 
Vijay Devarakonda Geetha Govindam Release Date Announced - Sakshi
ఈమూవీ దెబ్బకు ‘శ్రీనివాస కళ్యాణం’ పూర్తిగా ఖాళీ అయిపోతే అడవి శేషు ‘గూఢచారి’ కూడ ‘గీత గోవిందం’ బాధితుడుగా మారింది అని అంటున్నారు. ఈనేపధ్యంలో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వెంటనే టాలీవుడ్ హీరోలలో ఎవరి స్థానానికి ఎర్త్ పెడతాడు అన్న విషయమై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ఆస్కతికర చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం విజయ్ దేవరకొండ మ్యానియా వల్ల ముందుగా నష్టపోయేది నేచురల్ స్టార్ నాని అని అంటున్నారు. 

మన తెలుగు రాష్ట్రాలలో పక్కింటి అబ్బాయి ఇమేజ్ ఉన్న నాని సూపర్ హిట్ సినిమాలలో చాల మటుకు కామెడీ టచ్ ఉన్న సినిమాలే ఎక్కువ. ముఖ్యంగా ‘భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌’ ‘ఎంసీఏ’ లాంటి సినిమాలు అన్నీ నాని కామెడీ టచ్ వల్ల అదేవిధంగా పక్కింటి అబ్బాయి ఇమేజ్ వల్ల హిట్ అయ్యాయి. ఇప్పుడు యూత్ కు బాగా కనెక్ట్ అయిపోయిన విజయ్ దేవరకొండలో బాగా కామెడీ టచ్ ఉంది అన్న విషయాన్ని ‘గీత గోవిందం’ రుజువు చేసింది. 
Vijay Devarakonda wraps up Geetha Govindham
ఈమూవీ కథ సాధారణ స్టోరీ అయినా కేవలం ఈమూవీకి విజయ్ తన కామెడీ టైమింగ్ తో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో నానీని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ‌ల‌కు ఇప్పుడు విజ‌య్ కూడా మంచి ఆప్ష‌న్ గా మారుతాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో అదేవిధంగా ఫైనల్ కలక్షన్స్ విషయంలో విజయ్ దేవర కొండ నానీకంటే చాల ముందు స్థానంలో అతితక్కువ కాలంలో చేరుకున్న పరిస్థుతులలో టాప్ యంగ్ హీరోల పరిస్థితి ఎలా ఉన్నా నానీకి మాత్రం విజయ్ దేవరకొండ ప్రస్తుత పరిస్థుతులలో తీవ్ర పోటీ దారుడుగా మారే పరిస్థుతులు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈ విశ్లేషణలు అన్నీ విజయ్ ‘టాక్సీ వాలా’ ‘నోట’ మూవీల ఫలితం పై ఆధార పడి ఉంటుంది అని విశ్లేషకుల భావన..  


మరింత సమాచారం తెలుసుకోండి: