బాలీవుడ్ అంటే బ్యూటీఫుల్ హీరోయిన్స్ కి పెట్టింది పేరు. అక్కడ భామలు కేవలం బాలీవుడ్ సినిమాలు చేస్తే చాలు అని అక్కడికే పరిమితం అయిపోయారు. కాని దీపిక పదుకొనే మాత్రం యూనివర్సల్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఇటు బాలీవుడ్ తో పాటు అటు హాలీవుడ్ పై కూడా కన్నేసింది. అంతేనా అక్కడ కూడా గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.  


అక్కడితో ఆగకుండా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచి తన స్థాయి ఏంటో నిరూపించింది. ఇక ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సోషల్ మీడియాలో అమ్మడిని అభిమానులు డీప్ గానే ఫాలో అయిపోతున్నారు. ఒక్క ఇన్ స్టాగ్రామ్ లోనే దాదాపుగా 25 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఈ భామ క్రేజ్ ఏంటో తెలుస్తుంది.  


రీసెంట్ గా దీపిక మోనోక్రోమ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ లో జిమ్ డ్రెస్ లో దీపికా కనిపిస్తోంది. బాగా కసరత్తులు  చేసి అలసిపోయినట్లుగా కనిపిస్తోంది. మేకప్ లేకుండా.. కనీసం హెయిర్ సెట్ చేసుకోకుండా కనిపించడం అంటే మాములు విషయం కాదు. ఇలా ఉన్నా కూడా అందంగానే కనిపిస్తోందని నెటిజన్లు అనుకుంటున్నారు.  


బ్యూటీ అన్నది దీపికా పదుకునేకి బై బర్త్ వచ్చింది కదా. అలాంటప్పుడు మేకప్ లతో పనేముంటుంది. మేకప్ లేని దీపిక ఒరిజినల్ బ్యూటీని ఈ ఫొటోలో చూస్తున్న జనం అవాక్కవుతున్నారట. అంతేకాదు.. లైక్ లు మీద లైక్ ఇచ్చి అభిమానం చాటుకోవడంతో ఇది కాస్తా వైరల్ అయిపోయింది.   



మరింత సమాచారం తెలుసుకోండి: