తెలుగు బుల్లితెరపై అందరూ మెచ్చే..యాంకర్ ఎవరూ అంటే వెంటనే చెబుతారు సుమా కనకాల అని..కేరళ అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా యాంకరింగ్ చేస్తూ అందరి మనసు దోచింది.  తాజాగా యాంకర్ సుమ అందరికీ షాకింగ్ న్యూస్ చెప్పింది..ముఖ్యంగా మహిళలందరికీ ఇది కాస్త బాధాకరమైన న్యూస్ అనే చెప్పొచ్చు.  స్టార్ మహిళ.. బుల్లితెరపై తిరుగులేని షోగా పేరు తెచ్చుకుంది.  ఒంటి గంటకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ఎంతో మంది  అభిమానులున్నారు.

Image result for anchor suma star mahila

సుమారు 12 సంవత్సరాలుగా విజయవంతంగా దూసుకుపోతున్న ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు కూడా దక్కింది. మరి అలాంటి షో‌ని సడెన్‌గా ఎందుకు ఆపేస్తున్నారు. సుమా మాట్లాడుతూ..  ‘మీ అందరికీ ఈరోజు ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పబోతున్నాను. మీరు సుమ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ‘స్టార్‌ మహిళ’ కార్యక్రమం. ఏకధాటిగా గత 12 ఏళ్లుగా ఈ షో విజయవంతంగా దూసుకెళుతోంది. 

Image result for anchor suma star mahila

ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతంకాదు. అదే విధంగా ‘స్టార్‌ మహిళ’ ప్రయాణం కూడా ముగియనుంది. మరిన్ని వినూత్నమైన కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ‘స్టార్‌ మహిళ’కు చిన్న ముగింపు పలుకుతున్నాం. త్వరలో ఘనంగా ఫినాలే ఎపిసోడ్‌ను ప్రసారం చేయబోతున్నాం.మీరు నాకు, స్టార్‌ మహిళకు అభిమానులైతే.. ఓ  పని చేయండి. మీకు నేనంటే ఎంత ఇష్టమో, స్టార్‌ హిళ కార్యక్రమం అంటే ఎంత ఇష్టమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో  తీసి పంపండి. వాటిలో బెస్ట్‌ వీడియోలను ఎంపిక చేసి ఫినాలే ఎపిసోడ్‌లో ప్రసారం చేస్తామని సుమ తన ఫేస్‌బుక్ పేజీలోని ఓ వీడియోలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: