మెగస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇండస్ట్రీకీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రల్లో నటించారు.  తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో ‘జంజీర్’ తెలుగు లో తుఫాన్ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు.  ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ధృవ’ లో కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించారు.  తాజాగా మరోసారి రాంచరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్ తుది దశలో వుంది.  ఈ చిత్రంలో రామ్‌చరణ్ పాత్రపై తాజాగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కన్పించనున్నారట.  చరణ్ పాత్రను బోయపాటి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడట.
Image result for ram charan police
బోయపాటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు .. ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కి కూడా మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. అందువలన ఈ చిత్రంపై అందరిలోను  భారీఅంచనాలు వున్నాయి.  తమ అభిమాన హీరోని పవర్‌పుల్ ఆఫీసర్‌గా చేసేందుకు తెగ ఉవ్విళ్లూరుతున్నారట. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి సంక్రాంతి బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: