బెల్లం కొండ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా నే మాస్ డైరెక్టర్ వి. వి వినాయక్ తో తీశాడు. ఆ తరువాత కూడా పెద్ద డైరెక్టర్ అయినటువంటి బోయ పాటి శ్రీను తో సినిమా చేసినాడు అయితే ఈ రెండు సినిమాలు నిర్మాత కు పెద్దగా మిగిల్చిందేమి లేదు.  వి.వి వినాయక్ సినిమా వల్ల తండ్రి బెల్లంకొండ మరి సినిమాలు చేయడంలేదు. బోయపాటి సినిమా వల్ల నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నారు.

Image result for bellamkonda srinu

మరో సినిమా చేస్తానని మాట ఇచ్చిన బోయపాటి ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. ముచ్చటగా మూడో సినిమా చేసిన అభిషేక్ నామా పరిస్థితి కొద్దిగా బెటర్. విడుదలకు ముందు జరిగిన లావాదేవీల వల్ల కాస్త తక్కువ నష్టంతో బయటపడ్డారు. ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కొత్త డైరక్టర్ తో. మరొకటి తేజతో. కొత్త డైరక్టర్ సినిమాకు ఎలాగూ పెద్ద బడ్జెట్ వుండదు.

Image result for bellamkonda srinu

తేజ సినిమా కూడా అంతే. పైగా లాభాల్లో వాటా బేసిస్ మీద తేజ సినిమా చేస్తాడు. అందువల్ల ఆయన కూడా బడ్జెట్ గీత దాటనివ్వడు. ఇదిలావుంటే ఇప్పుడు నిర్మాత బెల్లంకొండ కొత్త డైరక్టర్లు ఎవరు కథలు చెబుతున్నా వింటున్నాడట. ఈ కార్యక్రమం కాస్త ఎక్కువగానే సాగుతోంది. అంటే ఇకపై పెద్ద సినిమాలు, పెద్ద డైరక్టర్లతో బెల్లంకొండ సినిమాలు వుండే అవకాశం తక్కువగా వున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: