యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన సినిమా గీతా గోవిందం. రిలీజ్ కు ముందే విపరీతమైన పాజిటివ్ బజ్ తో వచ్చిన ఈ సినిమా వారం మధ్యలో అయినా సరే హాలీడే కావడం వల్ల కలక్షన్స్ అదరగొట్టింది. ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబడుతుంది.


మొదటి రోజు 16 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజ్ లో దూసుకెళ్తుంది. రెండో రోజు కూడా 9 కోట్ల గ్రాస్ కెలెక్ట్ చేసి బాక్సాఫీస్ పై తన సత్తా చాటాడు విజయ్ దేవరకొండ. మొత్తం రెండు రోజుల్లో పాతిక కోట్ల గ్రాస్ తో గీతా గోవిందం అంచనాలను మించి వసూళ్లను రాబెడుతుంది.


విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆమె రోల్ కోసం చాలామంది హీరోయిన్స్ ను అనుకున్నారు కాని ఎవరు సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఫైనల్ గా ఛలో తర్వాత రష్మిక ఈ సినిమా చేసింది. ఆమె కూడా వరుస విజయాలతో దూసుకెళ్తూ లక్కీ హ్యాండ్ గా మారింది.


గీతా గోవిందం ఓవర్సీస్ లో కూడా వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. ఈ సినిమా దూకుడు చూస్తుంటే 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినా చేసేయొచ్చని తెలుస్తుంది. ఏరియాల వారిగా గీతా గోవిందం 2 డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 3.10 కోట్లు
సీడెడ్ : 1.60 కోట్లు
ఉత్తరాంద్ర : 1.00 కోట్లు
ఈస్ట్ : 0.81 కోట్లు
వెస్ట్ : 0.69 కోట్లు
కృష్ణా : 0.79 కోట్లు
గుంటూరు : 0.91 కోట్లు
నెల్లూరు : 0.35 కోట్లు
ఏపి/ తెలంగాణా : 9.25 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: