నందమూరి బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ పై అంచనాలు పెంచడానికి క్రిష్ ఈమూవీలో వీలైనంత మంది ప్రముఖ నటీ నటులను తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీనికితోడు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల లిస్టు చాలా పెద్దదిగా మరి పోవడంతో ఈమూవీ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి అనుకోని షాక్ మెగా అభిమానుల దగ్గర నుంచి తగిలి నట్లు వార్తలు వస్తున్నాయి. 
rakul preet singh item song in ntr biopic..?
ఎన్టీఆర్ బయోపిక్ లో అలనాటి టాప్ హీరోల పాత్రలు అన్నీ ఉండబోతున్నాయి.  దీనిలో బాగంగా క్రిష్ చిరంజీవి పాత్ర కోసం వరుణ్ తేజ్ ను ఎంపిక చేసాడు. వాస్తవానికి వరుణ్ తేజ్ ఈపాత్రలో నటించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు అన్న వార్తలు కూడ వచ్చాయి. అయితే తెలుస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ బయోపిక్ లో చిరంజీవిలా కనిపించడానికి వరుణ్ తేజ్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. 
Latest Movie Stills Of Varun Tej
దీనికి కారణం ఈమెగా యంగ్ హీరోకు మెగా అభిమానుల నుండి వచ్చిన ఒత్తిడి అని అంటున్నారు. నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిరంజీవి అభిమానులకు ఎప్పటి నుంచో వైరం కొనసాగుతూనే ఉంది. పైకి చిరంజీవి బాలయ్యలు ఈవిషయాలను పట్టించుకొనట్లు నటించినా వీరిద్దరి మధ్యనా కూడ చాల గ్యాప్ ఉంది

Krish Director wiki

అయితే ఇటువంటి వాస్తవాలను గుర్తించకుండా ఎన్టీఆర్ బయోపిక్ లో ఎలా నటిస్తున్నావు అంటూ వరుణ్ తేజ్ పై మెగా అభిమానుల అభిప్రాయాల ఒత్తిడి పెరగడంతో మెగా ప్రిన్స్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు టాక్.   దీనితో షాక్ కు గురైన క్రిష్ ఈ బయోపిక్ లో చిరంజీవి పాత్ర కోసం మరొక నటుడు గురించి ఆలోచించ కుండా చిరంజీవి పాత్రను తీసివేయాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: