తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో వందల చిత్రాలకు కథ, పవర్ ఫుల్ డైలాగ్స్ అందించిన గొప్ప రచయితలు ఎవరంటే వెంటనే చెబుతారు పరుచూరి బ్రదర్స్ అని..ఎందుకంటే వీరి రచనల్లో విప్లవం..రాజకీయం..సెంటిమెంట్, ఎమోషన్స్ అన్ని కలగలిపి ఉంటాయి.  అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల నుంచి నేటి తరం యువ హీరోల చిత్రాల వరకు కథలు, మాటలు అందించారు.పదునైన సంభాషణలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.   తాజాగా పరుచూరి గోపాల కృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఎన్నో చిత్రాల గురించి మాట్లాడారు. 
Image result for ntr narasimhudu movies
ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ నటించిన  'నరసింహుడు'  చిత్రం గురించి ప్రస్తావించారు.  ఎన్టీఆర్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో  విజయేంద్ర ప్రసాద్ కథతో ఓ చిత్రం చేయడానికి రంగం సిద్ధమైంది. అయితే ఆ చిత్రానికి నేను కొంత మేరకు మాటలు రాశాను..అనుకోకుండా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నేను అమెరికా నుంచి తిరిగి రాగానే.. కథ మారిపోయింది .. సాయికుమార్ తమ్ముడు రవి కథను తీసుకున్నారు.  ఆ కథ గురించి నాకు చెప్పారు..అదే ‘నరసింహుడు’చిత్రం. 
Image result for ntr narasimhudu movies
అయితే ఫ్యాక్షన్, యాక్షన్ తరహా చిత్రాలు అయిన ఆది, సింహాద్రి లో ఎన్టీఆర్ నటించారు.  అయితే ఈ చిత్రం ఎన్టీఆర్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందో నాకు అర్థం కాలేదు. దర్శక నిర్మాతలు బాగానే ఉంటుందనడంతో సరే మీ ఇష్టం అన్నాను.ఫ్లాష్ బ్యాక్ మొదలవ్వగానే అమీషా పటేల్, ఎన్టీఆర్ మధ్య లవ్ స్టోరీ మొదలవుతుంది..ఇంట్రవెల్ వరకు ఎన్టీఆర్ మాట్లాడకపోవడంతో అతడు మూగవాడు అనుకుంటారు. సడెన్ గా లవ్ స్టోరీ చెప్పడం కరెక్ట్ కాదు అన్నాను. అమీషా పటేల్ కోసం చూస్తారని నిర్మాత అన్నారు. ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ కాలేకపోయారు. ఇలా తప్పులు ఆ సినిమాలో ఎన్నో చేశారు...అంటూ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: