బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్స్ అందరి టార్గెట్ కౌశలే అని బిగ్ బాస్ ఫాలో అవుతున్న అందరు ఒప్పుకోవాల్సిన విషయమే. టాస్క్ ఏదైనా సరే కౌశల్ ఒక్కడే ఒకవైపు మిగతా హౌజ్ మెట్స్ అంతా మరో వైపు అన్నట్టు ఉంది పరిస్థితి. నూతన్ నాయుడు కౌశల్ కు సపోర్ట్ గా ఉన్నా పెద్దగా ఉపయోగం ఏమి లేదు.


ఇక లేటెస్ట్ గా నిన్న జరిగిన ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బాక్సులతో పిరమిడ్ నిర్మించాల్సి ఉంది. కౌశల్, రోల్ రైడా ఈ టాస్కులో పాల్గొనగా తనీష్, అమిత్, సామ్రాట్ కౌశల్ ను బాల్స్ తో టార్గెట్ చేశారు. మరోపక్క గీతా మాధురి, శ్యామలా, దీప్తిలు కౌశల్ కు సపోర్ట్ చేస్తూ రోల్ రైడా మీద బంతులు విసిరారు. 


అయితే తనీష్, సామ్రాట్, అమిత్ ల వల్ల కౌశల్ పిరమిడ్ నిర్మించడం కుదరలేదు. ఫలితంగా రోల్ రైడా ఆ టాస్కు గెలవడం జరిగింది. ఇక ఈ టాస్కులో భాగంగా కౌశల్ కు సపోర్ట్ చేస్తూ నూతన్ నాయుడు బాగానే ట్రై చేయగా చివర్లో అతని షోల్డర్ కు గాయమవడం వల్ల కన్ఫెషన్ రూంకు వెళ్లాడు.


నూతన్ కు గాయం పెద్దదే అని గుర్తించిన బిగ్ బాస్ అతన్ని హౌజ్ నుండి పంపిస్తున్నట్టు ప్రకటించాడు. ఫైనల్ గా ఓ పక్క స్నేహితుడు దూరమయ్యాడని బాధ.. కెప్టెన్సీ టాస్క్ గెలవలేదన్న దిగులు రెండిటిలో కౌశల్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. హౌజ్ లో అందరు కలిసి కౌశల్ ను టార్గెట్ చేస్తూ ఉండగా బయట మాత్రం అతనికి మరింత ఫాలోయింగ్ ఏర్పడేలా కనిపిస్తుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: