దక్షిణభారత సినిమారంగంలో టాప్ విలన్ గా కెరియర్ ను ఎంజాయ్ చేస్తున్న జగపతిబాబు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 30సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిలింఇండస్ట్రీ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. జీవితంలో కష్టాలు అన్నవి ఎక్స్‌పీరియన్స్ మాత్రమే అనుకుంటే ఎటువంటి సమస్యలు రావనీ కష్టాల గురించి భయపడినప్పుడే ఆత్మహత్యల ఆలోచనలు వస్తాయని అంటూ జీవితంలో ఒక తలుపు మూసుకుంటే మరోక తలుపు తెరుచుకుంటుంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
టాలెంట్ ఉండటమే ముఖ్యం
తాను ఫిలింఇండస్ట్రీలో ఎన్నో జీవితాలు చూసాను అంటూ ఇండస్ట్రీలో కనిపించని ఒకమ్యాజిక్ ఉందని షాకింగ్ కామెంట్స్ చేసాడు. తనకు యాక్టింగ్ తప్ప మరే విషయం తెలియకపోవడంతో తాను మరేరంగానికి సరిపోను అన్న ఉద్దేశ్యంతో తాను ఇండస్ట్రీలోనే విజయాలు పరాజయాలు ఇలా ఏమి వచ్చినా తాను పట్టించుకోకుండా అడుగులు వేస్తున్న విషయంగురించి వివరించాడు. 
రాజకీయాలు సూట్ కావు
జీవితం ఎండ్ వరకు డబ్బు కోసం పరుగెడుతున్న మనిషి మరణం తరువాత ఆడబ్బు తన వెంటరాదని తెలిసినా ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వందల కోట్లు బ్రోకర్ పని చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలోని కొందరిని టార్గెట్ చేస్తూ జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. వాస్తవానికి ఒక మనిషి సుఖంగా బ్రతకాలి అంటే 30, 40 కోట్లు ఉంటే చాలని అయితే ప్రస్తుతం చాలామందికి వందల కోట్లు సంపాదించాలని పిచ్చి పట్టి దెయ్యంగా మారిందని సెటైర్లు వేస్తున్నాడు జగపతిబాబు. 
వాళ్లు బ్రోకర్ పని చేసి సంపాదించారు
ఇదేసందర్భంలో ఇండస్ట్రీలో తాను ఇప్పటి వరకు ఎంతోమందితో కలిసి నటించినా ప్రభాస్ లాంటి  స్వీట్ హార్ట్ ను తాను ఎప్పుడూ చూడలేదు అంటూ ఎప్పుడైనా తాను పోన్ చేసినప్పుడు పనులు ఒత్తిడి వల్ల ప్రభాస్ కాల్ మిస్ అయితే వందశాతం రిటర్న్ కాల్ చెయడమే కాకుండా చాల ఆప్యాంగా మాట్లాడుతాడు అంటూ ప్రభాస్ మంచితనం పై ప్రశంసలు కురిపుస్తున్నాడు జగపతిబాబు. ఇదేసందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తనతో జూనియర్  చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు అన్నవిషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు బాగానచ్చిన వాళ్ళలో జూనియర్ ప్రప్రధముడు అంటూ తారక్ తో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు.  ఇది ఇలా ఉంటే జగపతిబాబు తిరిగి నిర్మాతగా మారబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఒక వెబ్ సిరీస్ తో పాటు సొంతంగా కొన్ని చిన్న సినిమాలుతీసి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే అభిప్రాయం తనకు ఉన్నట్లుగా ఈ విలక్షణ నటుడు తన సన్నిహితులకు లీక్స్ ఇస్తున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: