Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jan 23, 2019 | Last Updated 7:43 pm IST

Menu &Sections

Search

'పేప‌ర్ బాయ్' ట్రైల‌ర్ రిలీజ్!

'పేప‌ర్ బాయ్' ట్రైల‌ర్ రిలీజ్!
'పేప‌ర్ బాయ్' ట్రైల‌ర్ రిలీజ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో రచ్చ, బెంగాల్‌ టైగర్‌ సినిమాలతో మాస్‌ డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు సంపత్ నంది.  కేవలం దర్శకుడిగానే కాకుండా   నిర్మాతగానూ సక్సెస్‌ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు.  ఈ నేపథ్యంలో ఆది హీరోగా తెరకెక్కించిన ‘గాలిపటం’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.  తాజాగా మరోసారి డైరెక్టర్ సంపత్‌నంది సొంత బ్యానర్‌లో తెరకెక్కిస్తున్న సినిమా ‘పేపర్ బాయ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. 
paper-boy-movie-sampath-nandi-santhosh-shoban-riya
ఓ అమ్మాయి- ఓ పేపర్‌ బాయ్‌ మధ్య జరిగే లవ్ స్టోరీయే ఈ ఫిల్మ్ మెయిన్ థీమ్. కొత్త హీరోతో సినిమాలంటే కాస్త ధైర్యం చేయాల్సిన ఈ రోజులో  కంటెంట్ బాగుంట మంచి సక్సెస్ అందుకుంటుందన్న నమ్మకంతో సంపత్ నంది మరో సాహసం చేయబోతున్నాడు.  ‘ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా వుందా’ అంటూ హీరోయిన్ మాటలు, ‘ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది, అది కనిపించదు.. కానీ, బతికేస్తుంది’, ముద్దు పెట్టుకోవడమంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం అంటూ హీరో చెప్పిన డైలాగ్స్ తో సినిమా కూల్ లవ్ స్టోరీగా అనిపిస్తుంది.