ప్రకృతి విలయతాండవానికి ఎవ్వరూ తట్టుకోలేరు..ముఖ్యంగా గాలీ,నీరు,నిప్పు వీటిలో ఏది ఉద్రిక్తం అయినా..ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా ఉంటుంది. తాజాగా ఇప్పుడు కేరళాని వరుదనీరు ముంచేసింది..గత పది రోజుల నుంచి కేరళ జలదిగ్భందంలో ఉంది.  ప్రజల ఆహాకారాలు..ఆకలి బాధలు చెప్పనలవి కాదు..తమ ప్రజలను ఆదుకోవాలని కేరళా ముఖ్యమంత్రి సైతం రిక్వెస్ట్ చేయడం చూశాం. అందుకు స్పందించి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేరళా బాధితుల కోసం ఫండ్స్ పంపిస్తున్నారు.   
Image result for kerala floods
ఇక లీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటులు ముందుకొచ్చి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థికసాయం ప్రకటించి తమకు తోచినంత విరాళం ఇచ్చారు.   ఇలయదళపతి విజయ్ కేరళా బాధితుల బాధకు చలించిపోయి..భారీ విరాళాన్ని అందించారు.  తాజాగా విజయ్ కేరళా బాధితుల కోసం ఏకంగా రూ.14 కోట్లు విరాళం ఇచ్చారని సమాచారం. 
Related image
ఇంత పెద్ద మొత్తంలో ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరో సినీనటుడు ఉదయనిధి స్టాలిన్ కేరళ బాధితుల కోసం రూ.10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు.  కాగా, కేర‌ళ‌లో ఆగ‌స్టు 8 నుంచి కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ‌లు స్తంభించాయి. ప‌లు చోట్ల ఇల్లు కూలిపోతున్నాయి.
Image result for kerala floods
వేల గ్రామాలు జ‌ల‌దిగ్బంధ‌మ‌య్యాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంత‌రాయంగా శ్ర‌మిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ త్రివిధ ద‌ళాలు రంగంలోకి దిగి 3.10ల‌క్ష‌ల మందిని పున‌రావాసా కేంద్రాల‌కు త‌ర‌లించాయి.ర‌ళ సీఎం సైతం ప్ర‌జ‌లు విరివిగా విరాళాల‌ను ఇవ్వాల్సిందిగా అభ్య‌ర్థించారు. స‌హాయం చేసే వారు నేరుగా కేర‌ళ సీఎం డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్‌కు నిధుల‌ను పంప‌వ‌చ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: