సాధారణంగా సినిమా అన్న తర్వాత ఎలాంటి వారైనా నటిస్తారు..నటిస్తేనే సినిమా అవుతుంది. కానీ ఒకప్పటి రొమాంటిక్ హీరో..ప్రస్తుతం విలన్ అవతారం ఎత్తిన జగపతి బాబు తాజాగా తనకు నటించడం రాదు..అంటున్నారు. అయితే ఆయనకు నటించడం రాదు అన్నది రీల్ లైఫ్ లో కాదు..రియల్ లైఫ్ అట.  అడవిలో అభిమన్యుడు సినిమాతో హీరోగా పరిచయం అయిన జగపతి బాబు తర్వాత యాక్షన్ తరహా సినిమాలో నటించారు.  ఆ తర్వాత ఫ్యామీల తరహా సినిమాల్లో నటించి శోభన్ బాబు ని మరిపించాడు.
Related image
కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న సమయంలో అసలు తన కెరీర్ ఉందా లేదా అనుకుంటున్న పరిస్థితిలో బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా నటించి తన సత్తా చాటాడు.  ఆ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జగపతి బాబు  ప్రస్తుతం విలన్ గాను, కేరక్టర్ ఆర్టిస్ట్ గాను బిజీగా వున్నారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు.  ఈ మద్య ఓ కార్యక్రమంలో జగపతి బాబు మాట్లాడుతూ..ఇండస్ట్రీ గురించి ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for jagapati babu
అనుభవాలు నాకు ఎన్నో పాఠాలు నేర్పాయి .. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కంగారుపడకూడదు .. ఆత్మహత్య వంటి ఆలోచనలు చేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ వుంటుంది .. అది నిరూపించుకునే సమయం వచ్చేవరకూ వెయిట్ చేయాలి.  కెరీర్ లో నన్ను కూడా చాలా మంది అణచి వేయాలని చూశారని..కానీ ఒక్కో మెట్టు ఎక్కుతూనే వారికి సమాధానం చెప్పానని అన్నారు. 
Image result for jagapati babu gudachary
గతంలో తాను ఆర్థికంగా నష్టపోయానని..దారుణమై జీవితం గడుపుతున్నానని పుకార్లు పుట్టించారు.  కానీ అవేవీ నేను పట్టించుకోకుండా ఎక్కడా కుంగిపోకుండా బతికానని అన్నారు.  నా దగ్గర కొంతమంది రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ వుంటారు. రాజకీయాలు అంటే చాలామందిని కలవాల్సి వుంటుంది .. నేను అందరిలో కలవలేను... మాటలు కలపడాలు .. నటించడాలు నాకు చేతకాదు అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: