‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ కావడం విజయ్ దేవర కొండ లేటెస్ట్ గా నటిస్తున్న తదుపరి సినిమాల దర్శకులకు సమస్యగా మారింది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరోకి ఏర్పడిన మ్యానియాతో ఇతడి స్థాయి మిడిల్ రేంజ్ హీరోగా మారిపోయి ఏకంగా నానీ స్థానానికి ఎసరుపెట్టే స్థాయికి ఎదిగిపోయింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గీత గోవిందం’ నిర్మాణంలో ఉండగానే విజయ్ దేవరకొండ ‘టాక్సీ వాలా’ సినిమాను కూడ మొదలు పెట్టాడు. వాస్తవానికి ఈసినిమా ఎప్పుడో పూర్తి అయినా ఈమూవీ అవుట్ పుట్ విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి అన్న అనుమానంతో ఈసినిమాను వెనక్కి పంపి ‘గీత గోవిందం’ ను ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు ‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తో పెరిగి పోయిన విజయ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ‘టాక్సీ వాలా’ మూవీలో చాల మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. 
Vijay Devarakonda starts advertisements
అదేవిధంగా విజయ్ ని హీరోగా పెట్టి ఇప్పటికే మొదలైన ‘డియర్ కామ్రేడ్’ మూవీ స్క్రిప్ట్ విషయంలో కూడ మార్పులు చేయమని ఆమూవీ దర్శకుడి పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. మన ఇరు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడ విజయ్ దేవరకొండకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోయిన నేపధ్యంలో ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని ఇతడికి కథలు సెట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. 
Vijay Devarakonda to team up with sensible director Kranthi Madhav
దీనికితోడు ‘గీత గోవిందం’ తరువాత విడుదలయ్యే విజయ్ ‘టాక్సీవాలా’ అంచనాలను అందుకోవడం చాల కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా భవిష్యత్ లో విజయ్ తో సినిమాలు తీసే దర్శకులకు అతడికి మారిపోయిన ఇమేజ్ రీత్యా తిప్పలు తప్పవు అని అంటున్నారు. ప్రస్తుతం ఈమూవీ కేవలం మూడు రోజులలో 37 కోట్ల 45 లక్షల గ్రాస్ సాధించింది అని వస్తున్న వార్తలు చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: