యువ హీరోని స్టార్ గా తీర్చిదిద్దిన మూవీ అర్జున్ రెడ్డి. ఎవడే సుబ్రమణ్యం, పెళ్లిచూపులు సినిమాలతో సగటు హీరోగా అనిపించిన విజయ్ లో స్టార్ స్టఫ్ ఉంది అని చూపించిన సినిమా అర్జున్ రెడ్డి. 4 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 40 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. విజయ్ కు ఆ సినిమా యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేలా చేసింది.


ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా విజయ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ వచ్చేలా చేసింది. ఈ క్రమంలో రెండు రోజులుగా మళ్లీ అర్జున్ రెడ్డి కాంబోలో మూవీ రాబోతుందని అంటున్నారు. సందీప్ రెడ్డి విజయ్ తో మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. అయితే దానికన్నా ముందు సందీప్ వంగ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది.


మహేష్ 25వ సినిమాగా మహర్షి వస్తుంది. ఆ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా లైన్ లో ఉంది. అది పూర్తయ్యాక కాని మహేష్ తో సినిమా ఉంటుంది. సందీప్ వంగ ఈసారి మహేష్ ను పక్కా మాస్ రోల్ రాస్తున్నాడట. ఇంచుమించు అర్జున్ రెడ్డిలో విజయ్ పాత్రలా ఉంటుందని తెలుస్తుంది.


మహేష్ ను అర్జున్ రెడ్డి రోల్ లో అంటే కాస్త ఊహించుకోవడం కష్టమే అయితే మహేష్ మార్క్ తో ఆ పాత్ర మరింత కలర్ఫుల్ గా మారుతుంది. సినిమా టైటిల్ కూడా షుగర్ ఫ్యాక్టరీ అని ప్రచారంలో ఉంది. మరి ఆ షుగర్ ఫ్యాక్టరీ కథేంటో కొద్దిరోజులు గడిస్తే కాని చెప్పలేం.   



మరింత సమాచారం తెలుసుకోండి: