దసరాను టార్గెట్ చేస్తూ భారీ అంచనాలతో విడుదలకాబోతున్న ‘అరవింద సమేత’ రామ్ చరణ్ ‘రంగస్థలం’ ట్రిక్స్ ను అనుసరించడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. గతవారం విడుదలైన ఈమూవీ టీజర్ కు 10 మిలియన్ వ్యూస్ రావడంతో జూనియర్ అభిమానులు ప్రస్తుతం జోష్ లో ఉన్నారు.
Aravinda Sametha Teaser Pics
అయితే ఇక్కడితో తృప్తి పడకుండా జూనియర్ ఎన్టీఆర్ ఈమూవీకి సంబంధించి మరొక టీజర్ ను విడుదలచేయమని త్రివిక్రమ్ ను కోరినట్లు సమాచారం. గతవారం విడుదలైన ఈమూవీ టీజర్ జూనియర్ కు సంబంధించి ఒక రొటీన్ మాస్ మసాల మూవీలా ఉందని కామెంట్స్ రావడంతో పాటు త్రివిక్రమ్ సినిమాలలోని క్లాసీ టచ్ మిస్ అయింది అని కామెంట్స్ వచ్చిన పరిస్థుతులలో ఫ్యామిలీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మరొక టీజర్ ను ఈసినిమాకు సంబంధించి వీలైనంత త్వరలో విడుదలచేయమని జూనియర్ త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచినట్లు టాక్.
NTR-Trivikram's shoot happening on brisk pace
ఈవిషయంలో ఈసినిమాకు సంబంధించి ‘రంగస్థలం’ ట్రిక్ ను అనుసరించమని జూనియర్ త్రివిక్రమ్ ను అడుగుతున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ మూవీ విషయంలో తొలి టీజర్ చరణ్ మాస్ లుక్ ను పరిచయం చేస్తే అదే సినిమాకు సంబంధించి విడుదల చేసిన రెండవ టీజర్ లో సుకుమార్ సమంతను పరిచయం చేసాడు. అదేవిధంగా ‘అరవింద సమేత’ కు సంబంధించి అరవింద పాత్ర పోషిస్తున్న పూజా హెగ్డే లుక్ ను పరిచయం చేస్తూ ఆటీజర్ కు క్లాస్ టచ్ ఇమ్మని జూనియర్ కోరుతున్నట్లు సమాచారం. 

ఇలా ‘రంగస్థలం’ విధానాన్ని అనుసరిస్తూ వచ్చేనెల రెండవ వారంలో ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను తిరుపతిలో నిర్వహించమని కూడ జూనియర్ అడుగుతున్నట్లు సమాచారం. ఈమూవీ కథ అంతా ఫ్యాక్షన్ నేపధ్యంలో చిత్తూరు యాసలో డైలాగ్స్ ఉండబోతున్న నేపధ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతిలో ఈమూవీ ఆడియో ఫంక్షన్ జరిగితే బాగుంటుందని జూనియర్ అభిప్రాయం అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే మరికొద్ది రోజులలో అరవింద లుక్ తో మరో టీజర్ విడుదలై జూనియర్ అభిమానుల మధ్య సందడి చేయడం ఖాయం..
  


మరింత సమాచారం తెలుసుకోండి: