రకుల్ ప్రీతీ సింగ్ వరుసగా టాప్ హీరోస్ అయినా ఎన్టీఆర్ మహేష్ రామ్ చరణ్ వంటి బడా హీరోల సరసన నటించి ఒక్క సారిగా టాప్ హీరోయిన్ అయిపొయింది అయితే స్పైడర్ సినిమా లో మహేష్ సరసన నటించింది అధి కాస్త అట్టర్ ఫ్లాప్ అయ్యింది దీనితో ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.  ఒక టీవీ చానళ్లో ప్రముఖ కమేడియన్ నిర్వహించే టాక్ షోకు వచ్చే సెలబ్రిటీలంతా ఔట్ డేటెడ్ అయిన వాళ్లే.

Image result for rakul preet singh

అలా పాతవాళ్లు, తెరమరుగు అయిన వాళ్లు, ఖాళీగా కూర్చున్న వాళ్లను కూర్చోబెట్టి ఆ షోను నడుపుతున్నారు. ఇక ఆ షో ఏమైనా ఆసక్తిదాయకంగా ఉంటుందా? అంటే అంత సీన్ లేదు. ఏవో కుళ్లు జోకులు.. కాట్రవల్లి, కాట్రే.. అనే మాటలు తప్ప అంతకు మించి సదరు హోస్టు మరేం చేయలేకపోతున్నాడు. మాటల్లో స్పాంటేనివిటీ ఉండదు, సెలబ్రిటీలతో కొత్త విషయాలను చెప్పించేంత సీనూ ఉండదు. దీంతో.. అది అలా అలా నడుస్తోంది. అందుకేనేమో యంగ్ యాక్టర్లు, లీడ్‌లో ఉన్న వారెవరూ ఇందులో కనిపించరు.

Image result for rakul preet singh

అలాంటి షోకు వచ్చింది నటీమణి రకుల్ ప్రీత్ సింగ్. గత వారంలోనే ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. ఆ షోలో రకుల్ ను చూడగానే.. ఈ టాక్ షో రేంజ్ పెరిగిందా? లేక రకుల్ అంతా ఖాళీగా ఉందా? అనే సందేహం వస్తే తప్పు ప్రేక్షకుడిది కాదు. సీరియల్స్ చేసుకునే వాళ్లే వచ్చే టాక్ షోకు రకుల్ హాజరు అయ్యింది. ‘స్పైడర్’ తర్వాత రకుల్‌ను టాలీవుడ్ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: