శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. దీనితో ఈ విషయం మీద చాలా మంది హీరోయిన్స్ తమ కు ఎదురైనా అనుభవాలను, అభిప్రాయాలను మీడియా తో పంచు కున్నారు. అయితే 'ఆర్ఎక్స్ 100' తో కుర్ర కారు గుండెల్లో కాక రేపిన రాజ్ పుత్ పాయల్ కూడా కాస్టింగ్ కౌచ్ భాదితురాలేనంటా..! అయితే శ్రీరెడ్డి ఉదాంతం జరిగి మరువక ముందే హీరోయిన్స్ ను పక్కలోకి రమ్మనే నీచమైన సంస్కృతి మన నిర్మాతలు మానలేదు. 


'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను ఆ నిర్మాత పడక గదిలోకి పిలిచాడంటా..!

జస్ట్‌ ఓవారం క్రితం సదరు ఉత్తరాది బ్యూటీని సంప్రదించిన ఓ టాలీవుడ్‌ నిర్మాత నేరుగానే ‘కాంప్రమైజ్‌’ ప్రపోజల్‌ తెచ్చాడు. మంచి ఆఫర్‌ ఉందనీ అయితే అది నీకు ఇవ్వాలంటే... ‘పక్క’దారి పట్టాల్సిందేనని తేల్చి చెప్పాడు. దీంతో మండిపడిన ఆ అమ్మాయి... సదరు నిర్మాతను కొట్టినంత పనిచేసింది. ‘నేను  ఎప్పటి నుంచో ఫేమస్‌ టివీస్టార్‌ని. సినిమాలకి కొత్తేమీ కాదు. పంజాబీలో పేరున్న హీరోయిన్‌ని. టాలెంట్‌ను నమ్ముకుని ఇప్పటిదాకా పనిచేస్తున్నా తప్ప మీలాంటి వాళ్లకి లొంగిపోయి కాదు’’ అంటూ తిట్టిపోసి పంపించేసింది.


'ఆర్ఎక్స్ 100' హీరోయిన్‌ను ఆ నిర్మాత పడక గదిలోకి పిలిచాడంటా..!

అయితే అప్పటికీ ఆమె కోపం చల్లారలేదు. అదే సమయంలో తనను ఇంటర్వ్యూ చేయాడానికి సంప్రదించిన తెలుగు దినపత్రిక ప్రతినిధికి ఈ విషయం చెప్పి, దయచేసి ప్రచురించమంటూ అభ్యర్ధించింది. ఆ ఇంటర్వ్యూ ఆదివారం ప్రచురితమైంది. ఆ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌.. ఆర్‌ఎక్స్‌ 100లో నటించింది. మంచి పేరు తెచ్చుకుంది. ఆమె ఇచ్చిన ఇంటర్యూలో తెలుగు సినీ పరిశ్రమలో  సినిమా పాత్రల ఆఫర్లను ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం అనే సంప్రదాయం తనను దిగ్భ్రమకు గురిచేసిందని వాపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: