నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 మెల్లగా ఊపందుకుంది.  మొదట్లో బిగ్ బాస్ పై రక రకాల కామెంట్స్ వచ్చినా..గత ఐదు వారాల నుంచి ఇంటి సభ్యుల మైండ్ గేమ్..టాస్క్ లు, ఎలిమినేషన్స్ చూస్తుంటే కాస్త ఉత్సాహం పెరుగుతుంది.  ఇప్పటి వరకు 70 ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో టైటిల్ రేస్‌లో నువ్వా నేనా అంటూ కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. అయితే బిగ్ బాస్ లో సెలబ్రెటీల ఎంట్రీ లు కూడా మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.  ఆ మద్య విశ్వరూపం చిత్రం కోసం కమల్ హాసన్ ఆండ్ టీమ్ సందడి చేశారు. 


ఈ వారం (ఆదివారం) అర్జున్ రెడ్డితో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ, ‘గీతాగోవిందం’ దర్శకులు పరుశరామ్ సందడి చేశారు.  ఇక నాని, విజయ్ దేవరకొండ .. బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయనాను తో ఓ రేంజ్ లో ఆడుకున్నారు.  మొన్నటి వరకు ఈ అమ్మడు ఆడింది ఆటా..పాడింది పాటగా సాగింది. కానీ నిన్నటి ఎపిసోడ్ లో దిమ్మతిరిగే రేంజ్ లో నాని, విజయ్ లు ఆడుకున్నారు.   


టాక్ బ్యాక్‌తో హౌస్‌లో ఉన్న సునయనతో సీక్రెట్‌గా ఫన్నీ  టాస్క్‌లు ఆడిస్తూ ముప్పుతిప్పలు పెట్టారు.  ‘మీ అక్క పెళ్లి గురించి ఎమోషన్ అవుతున్నట్టు నటించు. కొడుకు కూడా పుట్టేశాడని చెప్పు’ అనడంతో సునయన జీవించేసింది. దీన్ని నమ్మేసిన రోల్ రైడా దగ్గరకు తీసుకుని హగ్ ఇవ్వడంతో.. అందరూ హగ్‌లు నీకు మాత్రమే ఇస్తారా? లేక అందరికీ ఇస్తారా? అంటూ పంచ్ పేల్చాడు విజయ్.  రోల్ రైడాను స్విమ్మింగ్ ఫూల్ లో పడేసే ప్రయ్నం చేయడం..ఎలిమినేషన్ గేమ్ అంటూ తనిష్ ని ఒప్పించి స్విమ్మింగ్ ఫూల్ లో దూకేలా చేయడం.  


ఆ తర్వాత ఒక లడ్డు సగం తిని తనిష్ నోట్లో పెట్టింది..ఆ తర్వాత రోల్ మొఖం పడేలా కొట్టాలని చెప్పారు. ఇక పడుకుని నిద్రపోతున్న అమిత్‌పై నీళ్లు పోసి ఆ బాటిల్‌ని గణేష్ చేతిలో పెట్టు.. అనడంతో అలానే చేసి.. ఏం గణేష్ అమిత్‌పై నీళ్లు ఎందుకు పోశావని గణేష్ ని ఇంరికించే ప్రయత్నం చేయడం. అమిత్ సీరియస్ అవడం అంతా ఫన్నీ ఫన్నీగా సాగింది. అయితే ఇది తనకు సిక్రేట్ టాస్క్ అని అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. చివరికి ఇదంతా తమ కామెంట్ మేరకే చిసిందని నాని, విజయ్ లు ఇంటి సభ్యులతో చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: