సినిమా ఇండస్ట్రీలో ఎంత టాప్ హీరోలు అయినా..వారికంటూ ప్రత్యేక అభిమాని ఉంటారన్న విషయం తెలిసిందే.  ఇండస్ట్రీలో ఒకప్పుడు శోభన్ బాబు ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా..రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చున్నారు.  ఆ తరహాలో మరో హిరో ఎవరూ రాలేద అనుకుంటున్న సమయంలో అడవిలో అభిమన్యుడు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన జగపతి బాబు..కొంత కాలం తర్వాత ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా, ఫ్యామిలీ తరహా సినిమాలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  కాకపోతే జగపతిబాబు కి చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం ఏవీ లేవనే చెప్పాలి. 
Image result for ntr jagapati babu
ఇదిలా ఉంటే జగపతి బాబు వ్యక్తిగతంగా ఆయన గురించి తెలిసినవారు..దగ్గరగా చూసిన వాళ్లు ఎంతో మెచ్చుకుంటారు.  నిజంగానే జగపతిబాబు చాలా మందికి ఆర్థికపరమైన సాయాలు చేసి నష్టపోయారు అంటుంటారు.  ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తాను స్వయంగా చెప్పారు.  ప్రస్తుతం లెజెండ్ సినిమాతో విలన్ గా యూటర్న్ తీసుకున్న జగపతి బాబు అప్పటి నుంచి క్యారెక్టర్ పాత్రలు, విలన్ పాత్రల్లో నటించి బిజీగా ఉన్నారు.  అయితే "హీరోగా అయితే సినిమా బాధ్యత అంతా నాపైనే వుంటుంది .. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు .. ఇలాగే బాగుంది. 
Image result for prabhas jagapathi babu
అయితే నా తోటి నటీనటులు .. టెక్నీషియన్లు .. నిర్మాతలు అంతా కూడా నన్ను హీరోను చూసినట్లుగానే చూస్తుంటారు. వారు చూపించే ఆప్యాయత నిజంగా నేను విలన్, హీరో అనే తేడా లేకుండా చేస్తుంది. ఆత్మీయతను కనబరిచేవాళ్లతో నేను ఎక్కువగా కనెక్ట్ అవుతాను. అలాంటివాళ్లలో ప్రభాస్ .. ఎన్టీఆర్ కనిపిస్తారు.

ప్రభాస్ కి ఫోన్ చేస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు..తాను ఓ పెద్ద స్టార్ అని ఎప్పుడో పొంగిపోడు..అంతే కాదు ఒకవేళ తాను అందుబాటు లో లేకుంటే..తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి క్షేమ సమాచారాలు అడుగుతాడు. ఎన్టీఆర్ కూడా అంతే అభిమానాన్ని కలిగి వుంటాడు. వాళ్లను నేను డిస్టర్బ్ చేయను .. కబురు చేస్తే ఇంటి దగ్గర కలుసుకుంటాను అంతే" అని చెప్పుకొచ్చారు.         



మరింత సమాచారం తెలుసుకోండి: