మరో రెండు రోజులలో రాబోతున్న చిరంజీవి పుట్టినరోజు హంగామా రేపటి నుంచే ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ‘సైరా’ టీజర్ రిలీజ్ డేట్ మరియు టైమ్ కు ఒక సెంటిమెంటల్ టచ్ ఇచ్చింది మెగా కాంపౌండ్. 
First look of Sye Raa Narayana Reddy
వాస్తవానికి ‘సైరా’ టీజర్ చిరంజీవి  పుట్టినరోజైన ఆగష్టు 22న విడుదల చేస్తారు అని భావించారు అంతా. అయితే రేపు మంచిరోజు అవ్వడంతో ఉదయం 11.30 నిముషాలకు ఈమూవీ టీజర్ విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ను రిలీజ్ చేసారు. 
A still from the biopic
దీనితో ఒకరోజు ముందుగానే చిరంజీవి పుట్టినరోజు సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. స్వాతంత్ర సమర యోధుడు నరసింహారెడ్డి కత్తిని హైలెట్ చేస్తూ ఈ ఉగ్ర నరసింహుని కత్తి అన్యాయాన్ని చూస్తూ ఊరుకునే రకం కాదు ‘సైరా’ అంటూ కత్తి ఎత్తితే తలలు ఎగిరి పడతాయి అన్న అర్ధం వచ్చేలా ఆమూవీ టీజర్ రిలీజ్ పోస్టర్ ఉంది. 
ఈ ఉయ్యాలవాడ ఖడ్గం గురించి అనేక కథలు కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు కాబట్టి ఆకథలను కళ్ళకు కట్టేడట్లుగా ఈ ‘సైరా’ టీజర్ ఉండబోతోంది అని సమాచారం.
చిరంజీవి సైరా కథేంటి ఇప్పుడు ? ఉన్నాడా ! లేడా ?క్లారిటీ
ఇప్పటికే టీజర్ కటింగ్ తో సహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెడీ అయిపోయింది అని సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ట్విట్ చేయడమే కాకుండా ‘నేను కూడా ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నాను. ఇలాంటి చారిత్రక సినిమాలో భాగం అయినందుకు ఎంతో ఉత్కంఠగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సిద్ధం. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తున్నా’ అని అంటూ ట్వీట్ చేసి ఈ టీజర్ పై అంచనాలు పెంచుతున్నాడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: