క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ బయటకు అమాయకంగా కనిపించినా వాస్తవానికి ‘మహా ముదురు’ అంటూ నిర్మాత అల్లు అరవింద్ ఘాటైన సెటైర్లు వేసాడు. అంతేకాదు ఒక విషయంలో ఎవరు ఎంత చెప్పినా చివరకు తాను అనుకున్న పని తనకు నచ్చిన విధంగా చేసే వ్యక్తిత్వం విజయ్ ది అంటూ అరవింద్ జోక్ చేసాడు. 
 లీక్‌తో ఒత్తిడి
ఇదే సందర్భంలో అరవింద్ మరొక ట్విస్ట్ ఇస్తూ విజయ్ తెలివితేటలను పరిశీలిస్తే తనకు చిరంజీవి పోలికలు కనిపిస్తాయి అని అభిప్రాయాన్ని వెల్లడించాడు ఈ మెగా ప్రొడ్యూసర్.  చిరంజీవి కూడ తన మనసులోని మాటను బయటపెట్టకుండా విజయ్ లాగే చివరకు తాను అనుకున్నది చేస్తాడు అంటూ చిరంజీవి పై కూడా సెటైర్లు వేసాడు అరవింద్.
విజయ్ దేవరకొండకు గొప్ప టాలెంట్
దర్శకుడు పరుశురామ్ గొప్ప రచయితని చెపుతూ ఒక మంచి రచయిత నటుడు కలిస్తే ఎలాంటి మంచి సినిమా వస్తుందో దానికి ఉదాహరణ ‘గీత గోవిందం’ అంటూ అభిప్రాయ పడ్డాడు అరవింద్. బన్నీ వాసు ఈకథ చెప్పినప్పుడు మొదట్లో విజయ్ దేవరకొండ కొంత ఆలోచనలో పడ్డ విషయాన్ని వివరిస్తూ చివరకు తన తెలివితేటలు ఉపయోగించి రికార్డులను క్రియేట్ చేసే సినిమా ఛాన్స్ మరెవ్వరికీ దక్కకుండా విజయ్ ప్రదర్శించిన తెలివితేటలు తనకు కూడ లేవు అంటూ జోక్ చేసాడు అరవింద్.
మెగాస్టార్‌ పెద్ద హృదయం
వాస్తవానికి ఈసినిమా షూటింగ్ సమయంలో ఎప్పుడు షూటింగ్‌ స్పాట్ కు అరవింద్ రాలేదట. అయితే సినిమా పూర్తి అయ్యాక ఎడిటింగ్ రూమ్ లో అరవింద్ ప్రదర్శించిన తెలివితో ఈమూవీకి చక్కటి ఎడిటింగ్ చేసారు అని స్వయంగా విజయ్ దేవరకొండ చెప్పడంతో వాస్తవానికి విజయ్ కన్నా అరవింద్ కే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అన్న విషయం మరొకసారి నిరూపింప బడింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: