తెలుగు ఇండస్ట్రీలో మెగఫ్యామిలీ అంటే ఎంత గొప్ప గౌరవమో అందరికీ తెలిసిందే.  స్వయంకృషితో అంచెలంచెలుగా ఇండస్ట్రీలో పైకి వచ్చి ఎంతో మంది హీరోలకు మార్గదర్శం అయ్యారు చిరంజీవి.  ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా..వస్తున్నా..వారికి మూలస్థం చిరంజీవి కష్టమనే చెప్పాలి.  ఇక చిరంజీవి రీల్ లైఫ్ లో హీరో అయినా రియల్ లైఫ్ లో మాత్రం తన తల్లిగారంటే ఎంతో ప్రాణమిస్తారు.  నాకు ఈ జన్మ ఇచ్చిన మాతల్లి రుణం ఏ జన్మకూ తీర్చుకోలేనని ఎన్నో సార్లు అన్నారు. 
Related image
ఎంత గొప్ప హీరో అయినా..తల్లికి మాత్రం కోడుకే కదా..ఇక పెద్ద కొడుకు అన్నా..అంజనీదేవికి ఎంతో ప్రాణం. తన బిడ్డను విడిచి ఒక క్షణం కూడా ఉండలేదు.  ఇదే విషయాన్ని ఓ మీడియాలో సాక్షిగా తెలిపారు.  ఈ నెల 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే.   ఈ సందర్భంగా అమ్మతో కలసి, చిరంజీవి సదరు మీడియాతో మాట్లాడారు. వారం, పది రోజుల కిందే అమ్మ తన వద్దకు వచ్చిందని ఆయన తెలిపారు. 
Image result for chiranjeevi with mothers
ఆ మద్య మేముంటున్న ఇంటిని  కొంచెం రెన్నోవేషన్ చేయిస్తున్నందున అమ్మగారు వేరే ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఈ మధ్య అమ్మ తనతో మాట్లాడుతూ,  ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటోందిరా.. నీ దగ్గరకు వచ్చేస్తా అని చెప్పగానే తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. వెంటనే అమ్మను తీసుకు వచ్చానని..అయితే ఆమె ఒంటరిగా ఉంటానని చెప్పినపుడు ఆమె నిర్ణయాన్ని గౌరవించామని..ఆమె వస్తానంటే సంతోషానికి అవధులు లేవని అన్నారు చిరంజీవి. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ తనకు ఏముంటుందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: