టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా ‘ఎన్టీఆర్’బయోపిక్.  మొదట్లో ఈ సినిమాపై రక రకాల రూమర్లు వచ్చాయి.  ఈ సినిమా దర్శకత్వ విభాగం నుంచి తేజ తప్పుకోవడం..అంత గొప్ప సినిమా తీయాలనే గడ్స్ ఎవరికీ లేకపోవడం..సినిమా అసలు తెరకెక్కుతుందా లేదా అన్న సందేహాలు వస్తున్న సమయంలో బాలకృష్ణ వందవ సినిమా ‘గౌతమి పుత్రశాతకర్ణి’లాంటి బ్లాక్ బస్టర్ అందించిన క్రిష్ ముందుకు వచ్చారు.  ‘ఎన్టీఆర్ ’ బయోపిక్ లో తనదైన మార్క్ చాటుకుంటూ..ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేస్తూ..సినిమాపై ఆసక్తి పెంచుతున్నాడు.
Image result for ntr biopic
ప్రస్తుత ఈ సినిమా ఎన్టీఆర్ స్వగృహంలో షూటింగ్ జరుపుకుంటుంది.  ప్ర‌స్తుతం ఈ మూవీ సెకండ్‌ షెడ్యూల్ జ‌రుపుకుంటుంద‌ని తెలుస్తుండ‌గా, చిత్రంలో పాత్ర‌ల‌కి సంబంధించిన క్లారిటీ మెల్ల‌మెల్ల‌గా వ‌స్తుంది. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. ప్ర‌స్తుత ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్ర‌లో రానా నటిస్తున్నాడు. ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టి మంజిమో మోహ‌న్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రలో రకూల్ ప్రీత్ సింగ్,  జయప్రద పాత్రలో రాశీఖన్నా,   అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ న‌టిస్తున్నారు. 
Image result for ntr biopic
అయితే ఎన్టీఆర్ జీవితో మరో ముఖ్య పాత్ర వహించింది..ఆయన కూతురు పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు.  తాజాగా ఆయన పాత్ర కోసం డాక్ట‌ర్ భ‌ర‌త్ రెడ్డిని మేక‌ర్స్ ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. వెంక‌టేశ్వ‌ర‌రావు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కీల‌క వ్య‌క్తిగా ఉన్నారు. ఆయ‌న పాత్ర కోసం ప‌లువురిని ప‌రిశీలించిన టీం చివ‌రికి భ‌ర‌త్ రెడ్డిని ఫైన‌ల్ చేసింద‌ట‌. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇద్దరి అల్లుళ్ల పాత్రలనూ చూపించనున్నారు. కాగా, వెంకటేశ్వరరావు పాత్రకు భరత్ రెడ్డి అయితేనే బాగుంటుందని సినిమా నిర్మాత బాలయ్య, సహ నిర్మాతలు విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి భావించినట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: