తెలుగు లో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన చలపతి రావు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఆయన తనయుడు రవిబాబు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.  మొదటి సినిమా అల్లరితో అద్భుతమైన విజయాన్ని అందుకున్న రవిబాబు తర్వాత విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.  దర్శకుడిగానే కాకుండా నిర్మాత, నటుడిగా కూడా తన సత్తా చాటుతున్నారు.  ప్రస్తుతం నటనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన రవిబాబు దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు.

తాజాగా పందిపిల్ల ప్రధానపాత్రలో విభిన్న దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అదుగో’. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అవును, అవును 2 , అనసూయ, అల్లరి లాంటి సినిమాలతో వైవిధ్యం అనిపించుకున్న రవి ఒక పంది పిల్ల కథాఅంశంగా అదిగో అనే సినిమా తెరకెక్కించాడు.
Image result for adhugo movie
ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని సంవత్సరంపైనే అయింది.  ఇప్పుడు దసరా కానుకగా విడుదలకి విడుదలకి సిద్ధం చేస్తున్నారు. రవిబాబు, పందిపిల్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లైవ్ యాక్షన్ త్రీడీలో తెరకెక్కింది.  పలు భారతీయ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సురేశ్ బాబు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: