ఒక హీరోకు స్టార్ ఇమేజ్ రాగానే అతడి అభిమానులు అతడికి ఒక స్టార్ ట్యాగ్ ను క్రియేట్ చేసి ఆ బిరుదుతో విపరీతంగా ప్రచారం చేస్తూ హోర్డింగ్స్ బ్యానర్స్ కటౌట్స్ పెడుతూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి విజయ్ దేవరకొండకు ఎదురౌతు ఉన్నా ఈ క్రేజీ స్టార్ కు ఏట్యాగ్ పెట్టాలి అన్న అయోమయం ప్రస్తుతం ఈహీరో వీరాభిమానులను వెంటాడుతున్నట్లు టాక్.
మెగాస్టార్‌ పెద్ద హృదయం
ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల విజయ్ దేవరకొండను ‘యంగ్ మెగా స్టార్’ అన్న ట్యాగ్ తో ప్రచారం చేస్తూ కొన్ని బ్యానర్లు హడావిడి చేసినట్లు సమాచారం. ఈవిషయాలు చిరంజీవి వరకు రావడంతో చిరంజీవి తెలివిగా మొన్న రాత్రి జరిగిన ‘గీత గోవిందం’  సక్సస్ మీట్ లో విజయ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా పేర్కొన్నాడు.
Mahesh Babu
అయితే చిరంజీవి నోటివెంట వచ్చిన ఈమాటలు మహేష్ అభిమానులకు కలవార పెడుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ గా మహేష్ కు ట్యాగ్ లైన్ ఉండగా అదే ట్యాగ్ విజయ్ దేవరకొండకు ఎలా చెల్లుతుంది అంటూ మహేష్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనితో విజయ్ దేవరకొండకు సూటయ్యే ట్యాగ్ కోసం ఇప్పుడు అతడి అభిమానులలో అన్వేషణ్ మొదలైనట్లు టాక్. 
విజయ్ స్టార్ హీరో అయ్యాడు
ఇప్పటికే మెగా స్టార్ నుండి నేచురల్ స్టార్ వరకు టాప్ హీరోలందరికీ ట్యాగ్ లు ఫిక్స్ అయిన నేపధ్యంలో విజయ్ స్టార్ ఇమేజ్ సరిపోయే విధంగా ట్యాగ్ ఫిక్స్ చేయడం అంత సులువు కాదని దీనికోసం చాల ఆలోచన చేయాలి అని అంటున్నారు. అయితే విజయ్ తన అభిమానులను ‘రౌడీస్’ అని ముద్దుగా పిలుచుకుంటున్న నేపధ్యంలో రాబోయే రోజులలో విజయ్ ‘రౌడీ సూపర్ స్టార్’ ట్యాగ్ తో సెటిల్ అయినా ఆశ్చర్యం లేదు..   



మరింత సమాచారం తెలుసుకోండి: