బిగ్ బాస్ లో ప్రతి సోమవారం నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న కంటెస్టంట్స్ లో నలుగురు ఇంటి సభ్యులు నామినేట్ అవడం జరిగింది. కౌశల్ తో పాటుగా ఈ వారం నామినేషన్ లో పూజా, తనీష్, దీప్తి నల్లమోతులు ఉన్నారు. దీప్తి పేరు నామినేషన్ లో చెప్పగానే ఆమె ఈ వారం బయటకు రావడం కన్ఫాం అనేస్తున్నారు.   


అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ కేవలం కౌశల్ ఆర్మీ చేతిలో ఉంది అన్నది హాట్ టాపిక్. గడిచిన వారాల ఎలిమినేషన్స్ అన్ని కౌశల్ ఆర్మీ టార్గెట్ తోనే జరిగాయి. అందుకే ఈ వారం కౌశల్ ఆర్మీ ఎవరిని టార్గెట్ చేస్తుంది అన్నది డిస్కషన్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ పూజా హౌజ్ లో లేట్ గా ఎంట్రీ ఇచ్చింది.


మొదట కౌశల్ గేం ప్లాన్ కు ఫిదా అయిన పూజా ఆ తర్వాత మాత్రం అతనికి రివర్స్ గా వెళ్తుంది. ప్రతి విషయంలో కౌశల్ మీద నెగటివ్ కామెంట్స్ చేస్తుంది పూజా. ఇక తనీష్ కూడా కౌశల్ తో ప్రతి విషయంలో వ్యతిరేకిస్తూ వచ్చాడు. కౌశల్ ఆర్మీ తనీష్ ను టార్గెట్ చేస్తే కనుక తనీష్ రిస్క్ లో పడినట్టే. 


ఇక దీప్తి నల్లమోతు కూడా కౌశల్ పై అడపాదడపా కామెంట్స్ చేసినా ఆమెను కౌశల్ ఆర్మీ సేఫ్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ పూజా, దీప్తిలలో ఒకరిని చేస్తే ఏమో కాని హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ లో ఒకరిగా ఉన్న తనీష్ ఎలిమినేట్ అయితే మాత్రం ఇక బిగ్ బాస్ హౌజ్ లో కౌశల్ కు తిరుగు ఉండదని చెప్పాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: