గత పదిహేను రోజుల నుంచి కేరళాలో కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతుంది.  ప్రస్తుతం వర్షాలు తగ్గు ముఖం పట్టినా..అది మిగిల్చిన కష్టాలు, కన్నీరు మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా లేదనిపిస్తుంది.  ప్రస్తుతం కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయి.  గతంలో ఎన్నడూ లేని విధంగా కేరళలను వదరలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. వరదల కారణంగా లక్షలాది మంది సునరావాస కేంద్రాల్లో గడపుతున్నారు. వారిని ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు.

గ్రామాలు, పట్టణాళను వరదనీరు ముంచెత్తింది. దాదాపు 10 నుండి 15 అడుగల మేర నీళ్లు ప్రవహిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 400 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది గాయపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.  వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళలో ప్రధాని నరేంద్ర మోడి ఏరియల్ సర్వేను నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. జరిగిన నష్టాన్ని గురించి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితెలుసుకున్నారు.
Image result for kerala floods
తక్షణ సహాయంగా రు.500 కోట్లను ప్రధాని ప్రకటించారు. మరోవైపు ఈ విపత్తు వల్ల కేరళకు దాదాపు 25వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం 2000వేల కోట్ల రూపాయల సహాయం అందిచాలని ఆయన కోరారు. తాజాగా కేరళ వరద బాధితులకు సహాయం అందించడంలో భాగంగా ఆర్ఎక్స్ 100 చిత్ర బృందం ఈ మూవీలో హీరో వాడిన బైక్ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బును కేరళ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కోసం వెచ్చించనున్నట్లు తెలిపారు.
Image result for kerala floods
ఆర్ఎక్స్ 100 సినిమాకు మీరు అందించిన ప్రోత్సాహం మేము ఎప్పటికీ మరిచిపోలేము. ఒక సాంగ్ వచ్చినా, ట్రైలర్ వచ్చినా, టీజర్ వచ్చినా మీరు అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు.  వేలంలో పాల్గొనాలనుకునే వారు తమ వివరాలు, బిడ్ చేసే అమౌంట్ rx100auction@gmail.com  కి మెయిల్ చేయండి. లేదంటే 9100445588 ఫోన్ నెంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని ఈ సందర్భంగా కార్తికేయ తెలిపారు. లేదంటే 9100445588 ఫోన్ నెంబర్‌కు వాట్సాప్ చేయవచ్చని ఈ సందర్భంగా కార్తికేయ తెలిపారు. బిడ్డింగ్ రూ. 50 వేల నుండి మొదలవుతుందన్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెంది స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ స్థాయికి తగ్గట్టుగా విరాళాలు పంపుతున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: