ప్రస్తుత రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే అనౌన్స్ చేస్తున్నారు. చెప్పడం వరకు ఓకే కాని చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడానికి డైరెక్టర్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. అనౌన్స్ చేసిన డేట్ కాబట్టి ఫ్యాన్స్ ఎదురుచూపులు ఉంటాయి. అలాగే మిగిలిన హీరోల సినిమాలు కూడా డేట్ ని బట్టి రిలీజెస్ అడ్జెస్ట్ అవుతుంటాయి. 


ఒకవేళ సినిమా రిలీజ్ లేట్ అవుతుందని భావిస్తే మూవీ యూనిట్ ముందుగానే చెప్పేయాలి. ఎప్పుడు విడుదల చేస్తారో కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకనేగా మీ డౌట్..? అక్కడికే వస్తున్నాం. నాగ చైతన్య హీరోగా మరుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. ఈ నెల 31న రిలీజ్ ప్లాన్ చేసిన మూవీ వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది.   


నాగచైతన్య మరో సినిమా సవ్యసాచి కూడా ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని చూశారు.మారుతి రంగంలోకి దిగి తన సినిమా మాత్రం ఖచ్చితంగా ఆగష్టు లోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టాడు. ఇదిలాఉంటే.. అనుకోకుండా సవ్యసాచి మూవీ షూటింగ్ లేట్ కావడంతో పోస్ట్ పోన్ అయింది. ఇంకేం పర్లేదు అని ఊపిరి పీల్చుకుంటున్న టైమ్ లో కేరళ హెవీ రెయిన్స్ ఎఫెక్ట్ శైలజా రెడ్డి అల్లుడు మీద పడింది.      


ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ కేరళకు చెందిన వాడు అవడం అక్కడ భారీ వర్షాలు సినిమా ఆర్.ఆర్ కంప్లీట్ అవకుండా చేశాయట. అందుకే ఈ సినిమాను వాయిదా వేయక తప్పదని తెలుస్తుంది. ఆగష్టు 31 నుండి వాయిదా పడిన శైలజా రెడ్డి అల్లుడు సెప్టెంబర్ 13న రిలీజ్ షెడ్యూల్ ప్లాన్ చేశారట. చైతు సరసన అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఇంపార్టెంట్ రొల్ ప్లే చేస్తుంది.       


మరింత సమాచారం తెలుసుకోండి: