కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో అలజడి రేపిన తెలుగు నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కించనున్నట్టు తెలిపింది. తెలుగు అమ్మాయిల‌కు సినిమాల్లో హీరోయిన్ గా అవ‌కాశం ఇవ్వ‌డం లేదంటూ టాలీవుడ్ ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి, ఆత‌ర్వాత ద‌క్షిణాది రాష్ట్రాల అమ్మాయిల‌కు కూడా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంటూ టాలీవుడ్ తో పాటు, కోలీవుడ్ వ‌ర్గాల్లోనూ అల‌జ‌డి రేపిన సంగ‌తి తెలిసిందే.  


ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ కావాంటే..  క‌మిట్మెంట్ అడుగుతున్నార‌ని, వాడుకుని వ‌దిలేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ఆమె, అనంత‌రం ప‌లువురి పేర్లు, ఫోటోలు, ఫోన్లో జ‌రిపిని చాటింగ్ వంటి ప‌లు ఆధారాల‌ను బ‌య‌టపెట్టి ప‌లువురి గుండెల్లో ద‌డ పుట్టించింది.  శ్రీరెడ్డి నటిస్తున్న ‘రెడ్డి డైరీ’కి  అల్లావుద్దీన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సందర్భంగా నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ..తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని హెచ్చరించింది.

Image result for sri reddy protest

 తాను నటించబోయే ‘రెడ్డి డైరీ’ సినిమాకి సహకరించేందుకు నడిగర్‌ సంఘం హామీ ఇచ్చిందని చెప్పింది. ఇదిలా ఉంటే..ఇప్పటికే ఇండస్ట్రీలో శ్రీరెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు..ఇక శ్రీరెడ్డి బ‌యోపిక్ అంటే ఇంకెన్ని కోణాల్లో, ఎంద‌రి బాగోతాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌బోతుందో అన్న ఆందోళ‌న ప‌లువురు సినీ ప్ర‌ముఖుల్లో వ్య‌క్తం అవుతుంది.   ఆమె వ‌ద్ద ఉన్న ఆధారాల‌న్నింటినీ సినిమాలో చూపిస్తే ఇంకేమైనా ఉందా అంటూ ప‌లువురు టెన్ష‌న్ పడుతున్న‌ట్లు సినీ ప్ర‌ముఖులు భావిస్తున్నారు. చూడాలి మ‌రి, ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్క‌బోతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: