నిన్నరాత్రి మెగా అభిమానుల సమక్షంలో మెగా స్టార్ చిరంజీవి 63వ పుట్టినరోజు వేడుకలు అత్యంత కోలాహలంగా జరిగాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు రామ్ చరణ్ సునీల్ ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ ఫంక్షన్ లో మాట్లాడిన రామ్ చరణ్ ‘సైరా’ టీజర్ పై పవన్ కళ్యాణ్ చెప్పిన అభిప్రాయాన్ని మెగా అభిమానులకు తెలియచేసి వారికి జోష్ ను కలిగించాడు.
ఇండస్ట్రీ మంచి కోసమైనా మా సినిమాను పడగొట్టాలి
‘సైరా’ టీజర్ ఫైనల్ కట్ తయారైన తరువాత తాను మొట్టమొదట ఈ టీజర్ ను చూడమని తన బాబాయ్ పవన్ కు ఒక ప్రత్యేక వ్యక్తి ద్వారా పంపిన విషయాన్ని తెలియచేసాడు. పవన్ ఈ టీజర్ చూసిన వెంటనే ‘అదిరిపోయింది’ అంటూ తాను ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అన్న ఆతృతతో ఉన్నాను అంటూ ఈమూవీ చరిత్ర సృష్టించడం ఖాయం అంటూ పవన్ తన అభిప్రాయాన్ని తెలియచేసిన విషయాన్ని బయటపెట్టడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులులేవు.
Allu Arjun and Ram Charan   (Photo: DC archives)
‘సైరా’ పూర్తి కావడానికి కనీసం ఇంకా 8 నెలలు పడుతుందని రిలీజ్ విషయంలో ఇంత లాంగ్ గ్యాప్ ఉన్న సినిమాకు ఇంత ముందుగా టీజర్ రిలీజ్ చేయరని అయితే మెగా అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక కానుక ఇవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఇంత ముందుగా ఈమూవీ టీజర్ ను విడుదల చేసిన విషయాన్ని తెలియచేసాడు చరణ్. ఇదే సందర్భంలో ఉద్వేగంతో అల్లుఅర్జున్ మాట్లాడుతూ చిరంజీవి అంత గొప్పనటుడు తాను జీవితంలో అవ్వలేక పోయినా కనీసం చిరంజీవి అంత మంచి వ్యక్తి అయినా అవ్వాలని ప్రయత్నిస్తున్నాను అంటూ మెగా స్టార్ ను ఆకాశంలోకి ఎత్తేశాడు బన్నీ. 
AlluArjun Fans
ఇదే సందర్భంలో బన్నీ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ‘సైరా’ టీజర్ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి రాకపోవడంతో మెగా అభిమానులకు కలిగిన అసంతృప్తిని వివరిస్తూ టాప్ హీరో చిన్నచిన్న విషయాలకు రారని క్లైమాక్స్ లోనే ఎంటర్ అవుతారు అంటూ తన మామయ్యా స్టార్ ఇమేజ్ పై ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. బౌన్సర్లు వేదిక పై మెగా అభిమానుల తాకిడి లేకుండా ఎంత ప్రయత్నించినా మెగా అభిమానుల ఉత్సాహం మితిమీరిపోవడంతో చరణ్ అల్లు అర్జున్ లు ఈసమావేశానికి సంబంధించిన కేక్ కటింగ్ అయిన వెంటనే ఆ మెగా అభిమానుల తోపిడిని తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోవడం నిన్నటి కార్య క్రమంలోని ట్విస్ట్..    


మరింత సమాచారం తెలుసుకోండి: