నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పరుచుకుని మెగా స్టార్ అనే పిలుపుతో తన అభిమానులకు దగ్గరైన చిరంజీవి పుట్టినరోజు అంటే మెగా అభిమానులకు ఒక సంక్రాంతి పండుగ. నందమూరి తారక రామారావు తరువాత అభిమానులతో ‘అన్నయ్య’ అంటూ అభిమానంతో పిలిపించుకునే అదృష్టం ఒక్క చిరంజీవికే దక్కింది. 
ఇండియా అన్‌సంగ్ హీరో
63 సంవత్సరాల వయస్సులో స్వాతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ పాత్రను చేస్తూ భారీ యాక్షన్ సీన్స్ తో కూడిన ‘సైరా’ టీజర్ సంచలనాలు కొనసాగిస్తోంది. ఈనేపధ్యంలో ఆభారీ యాక్షన్ సీన్స్ లో నిజంగా చిరంజీవి నటించాడా లేదా లేక గ్రాఫిక్స్ మాయ అనుకోవాలా అన్న సరికొత్త చర్చలకు దారితీసింది. 
బ్రిటిషర్ల అకృత్యాలు
ఈవిషయమై నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఒక ఆసక్తికర కామెంట్స్ ప్రసారం చేసింది. ‘సైరా’ సంబంధించి భారీ యాక్షన్ సీన్స్ విషయంలో మాత్రమే చిరంజీవికి డూప్ ను ఉపయోగిస్తున్నారని అదేవిధంగా రిస్కీ యాక్షన్ సీన్స్ విషయంలో గ్రాఫిక్ మాయాజాలాన్ని అనుసరిస్తూ ఎక్కడా సహజత్వానికి నష్టం జరగకుండా చిరంజీవి యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయడంలో హాలీవుడ్ నిపుణులు అనుసరిస్తున్న విధానం ఈమూవీ యాక్షన్ సీన్స్ కు హైలెట్ గా మారుతుందని ఆ ఛానల్ ‘సైరా’ టీజర్ పై తన కామెంట్స్ ప్రసారం చేసింది.
రత్నవేలు సినిమాటోగ్రఫీ
నిన్న విడుదలైన ‘సైరా’ టీజర్ కు బోనస్ గా నిన్నరాత్రి మెగా అభిమానులకు మరింత జోష్ కలిగించడానికి ‘సైరా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడ విడుదల చేసారు. వారియర్ లుక్ లో కనిపిస్తున్న చిరంజీవి తన 63 ఏళ్ల వయస్సులో కూడ ఒక యోధుడుగా కనిపించి మెప్పించగలడు అన్న తీరులో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ముఖ్యంగా చిరంజీవి లుక్ విషయంలో అతడి స్టైలిస్ట్ లు తీసుకున్న జాగ్రత్తలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సపష్టంగా కనిపిస్తున్నాయి. 18వ శతాబ్దానికి చెంది చరిత్రలో ఎక్కడా ఆధారాలు స్పష్టంగా లేని ఒక ప్రప్రధమ స్వాతంత్ర సమరయోధుడి కథను ‘సైరా’ గా చిరంజీవి మలుస్తూ ఉండటంతో ఆచరిత్రలో యదార్దాలను పక్కకు పెడితే చిరంజీవి కెరియర్ లో ఈసినిమా ఒక మైల్ స్టోన్ గా మారుతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: