మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా కేరాఫ్ అడ్రెస్ గా మారిన పేరు అది. ప్రాణం ఖరీదు సినిమా నుండి ఖైది నంబర్ 150 వరకు ఓ అద్భుతమైన నటుడి ప్రస్థానం. ఇప్పుడు కాదు తెలుగు సినిమాను ఎల్లలు దాటి సత్తా చాటేలా చేసిన మొనగాడు. ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. 


కెరియర్ మొదట్లో ఆయన చురుకుదనం చూసి ఇతనెవరో బాగా యాక్టివ్ గా ఉన్నాడు అనుకున్నారు. మంచు పల్లకి సినిమాలో మనసులు గెలిచిన చిరు ఆ తర్వాత సోలో హీరోగా కెరియర్ మొదలు పెట్టాడు. నటనతో ఎలా మెప్పిస్తాడో డ్యాన్సుల్లో కూడా అలానే తన స్టైల్ ను కొనసాగించారు మెగాస్టార్ చిరంజీవి. 


సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లి.. మెగాస్టార్ గా స్క్రీన్ నేం నే కాదు అభిమానుల హృదయాలను గెలుచుకున్న మగ మహారాజు చిరంజీవి. తెలుగు పరిశ్రమ సత్తాని నేషనల్ వైడ్ గా తెలియచేసిన హీరో అతను. కేవలం కమర్షియల్ సినిమాలే కాదు కళాత్మక, కుటుంబ కథా చిత్రాలను ఆయన చేశారు. స్వయంకృషితో పైకొచ్చే ప్రతి మనిషికి ఆదరశం మెగాస్టార్.. అంతేకాదు హీరో అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి మొదటి స్పూర్తి మెగాస్టార్ చిరంజీవి. 


మెగాస్టార్ చిరంజీవి వేసిన రెడ్ కార్పెట్ మీద ఇప్పుడు ఉన్న మెగా హీరోలంతా నడుస్తున్నారు. మెగాస్టార్ తర్వాత పవన్ కళ్యాణ్, రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, అల్లు శిరీష్, నిహారిక ఇలా అందరు మెగాస్టార్ అండ.. మెగా అభిమానుల సపోర్ట్ తోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది ఏపిహెరాల్డ్.కామ్ టీం.   



మరింత సమాచారం తెలుసుకోండి: