కేరళాలో పదిహేను రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లాయి..ఆనకట్లు సైతం బీటలు వారి గ్రామాలు, పట్టణాలు జలదిగ్భందం అయ్యాయి.  రోడ్లు, వంతెనలు కొట్టుకుని పోయాయి. కొన్ని ఇళ్లు కళ్ల ముందే పేకమేడల్లా కూలిపోయాయి.  వేల మంది నిరాశ్రయులు కాగా 360 మంది మృత్యువాత పడినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.  వృద్దులు చిన్నపిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 3.5 లక్షల మంది ఇళ్లు వాకిలి వదిలిపెట్టి పభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రయాల్లో తలదాచుకుంటున్నారు.
floods in kerala
అనారోగ్యంతో బాధపడుతున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం సహాయక బృందాలకు తలకు మించిన భారంగా తయారయింది. జాతీయ విపత్తు నివారణ సంస్థతో పాటుగా ఆర్మీ,నేవీ,ఎయిర్ ఫోర్స్ దళాలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నప్పటికీ సరిపోవడం లేదు. అయితే కేరళాను ఆదుకోవడానికి భారత దేశంతో పాటు పొరుగు దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) పెద్ద మనసు చాటుకుంది. కేరళ రాష్ట్రానికి తమ వంతు సాయం చేస్తామని ఆ దేశం ముందుకి వచ్చింది.

ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఒక కీలక ప్రకటన చేసారు. 700 కోట్లు సాయం చేస్తామని ఆ దేశం ప్రకటించినట్టు ఆయన వెల్లడించారు. ఇక సీనీ ఇండస్ట్రీకి చెందిన వారు ఇప్పటికే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు.  అయితే తమిళ హీరో విజయ్ ఆ మద్య 14 కోట్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి..కానీ అవన్నీ వట్టి రూమర్లు అని చెబుతున్నారు.  తాజా సమాచారం మేరకు విజయ్ తన వంతు సహాయంగా కేరళా బాధితులకు రూ.70 లక్షలు అందించినట్లు సమాచారం.
Image result for kerala floods
అది కూడా నేరుగా రిలీఫ్ ఫండ్ కి కాకుండా తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు నేరుగా సాయం అందేలా ఏర్పాట్లు చేశాడు. విజయ్ రూ.70 లక్షల సాయం ప్రకటించడంతో రూ.14 కోట్లు తప్పుడు వార్త అని తేలింది. బాధితుల కోసం ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నేప్‌కిన్లు, మందులు, ఇతర అవసరమైన వస్తువులను వరద ప్రభావానికి గురైన 12 జిల్లాలకు పంపించారు. వీటిని తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు అందజేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: