‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో ఒకేసారి క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజ్ పుట్ కు అనేక అవకాశాలు ఆమెకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వస్తూ ఉన్నా ఆమె చెపుతున్న కండిషన్స్ కు ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నట్లు సమాచారం. కథకు సంబంధం లేకుండా తాను ఎక్స్ పోజింగ్ సీన్స్ లో నటించనని తాను నటించే సినిమాలోని పాత్ర తనకు నచ్చాలి అంటూ కండిషన్స్ పెడుతోంది పాయల్.
Image may contain: 1 person, close-up and outdoor
ఇప్పటికే ఈమె తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీను మూవీలో అదేవిధంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న మూవీలో ఒక స్పెషల్ రోల్ చేయడానికి ఇలా వస్తున్న అనేక ఆఫర్లను తనకు నచ్చలేదు అని వదులుకుంటోంది పాయల్. ప్రస్తుతం ఈమె సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఒక లేడీ ఓరియంటెడ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
Image may contain: 1 person, indoor
ఇది ఇలా ఉండగా బోయపాటి శ్రీను రామ్ చరణ్ తో తీస్తున్న భారీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ను చేయడానికి పాయల్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ లో నటించినందుకు ఆమెకు 40 లక్షల పారితోషికం ఇస్తాము అని బోయపాటి ఆఫర్ చేసినా పాయల్ ఆపారితోషికానికి ఏమాత్రం తలఒగ్గక తాను ఐటమ్ సాంగ్స్ చేయను అంటూ సున్నితంగా ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. 
Image may contain: 1 person, smiling
టాప్ హీరోయిన్స్ గా పేరుపొందిన తమన్నా కాజల్ సృతిహాసన్ లాంటి క్రేజీ హీరోయిన్స్ టాలీవుడ్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకున్న విషయాన్ని దర్శకుడు బోయపాటి పాయల్ కు వివరించినా తన పద్ధతి మార్చుకోను అంటూ ఇచ్చిన సమాధానం హాట్ న్యూస్ గా మారింది. మెగా కాంపౌండ్ హీరోలతో ముఖ్యంగా చరణ్ అల్లు అర్జున్ లతో నటించడమే ఒక అదృష్టం అని చాలామంది హీరోయిన్స్ భావిస్తున్న పరిస్థుతులలో పాయల్ ఇప్పుడు మెగా కాంపౌండ్ కు ఇచ్చిన షాక్ టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: