మెగా స్టార్ చిరంజీవి జీవితం ఒక తెరిచిన పుస్తకం అని అతడి అభిమానులు భావిస్తూ ఉంటారు. స్వయంకృషితో ఎన్టీఆర్ ఏఎన్నార్ ల తరువాత గత నాలుగు దశబ్దాలుగా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న చిరంజీవి ఒక్క రాజకీయాలలో తప్ప ఇప్పటికీ మెగాస్టార్ గా కొనసాగుతూనే ఉన్నాడు. చిరంజీవి జీవితానికి సంబంధించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఒక ప్రముఖ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.  
చేతి రాత బావుండదు
నటుడుగా డాన్సర్ గా కోట్లాది మంది అభిమానులను పొందిన చిరంజీవికి ఇష్టమైన హాబీ ఫోటోగ్రాఫీ చిన్నప్పటి నుంచి ఖరీదైన కెమెరాలను కొనుక్కోవాలని చిరంజీవి ముచ్చటపడినా తన మధ్యతరగతి కుటుంబ నేపధ్యం వలన ఖరీదైన కెమెరాలను కొనుక్కోలేకపోయాడట. అయితే చిరంజీవి సినిమాలలోకి వచ్చాక తనసంపాదన పెరగడంతో చిరంజీవి తనకు ఇష్టమైన అనేక కెమెరాలను కొనుక్కుని తన ఇంటిలోని ఒకగదిలో కెమెరాల షోరూంగా మార్చేశాడు అన్న విషయం చాల తక్కువమందికి తెలిసిన నిజం. ఒక వ్యక్తికి అతడి చిన్ననాటి జీవితాన్ని గుర్తుకు చేస్తూ ఇచ్చే ఫోటో ‘కోటి’ రూపాయల బహుమతికన్నా చాల ఆనందాన్ని ఇస్తుంది అన్నది మెగా స్టార్ అభిప్రాయం. 
 పజిల్ గేమ్స్
మరొక షాకింగ్ విషయం ఏమిటంటే చిరంజీవి చేతిరాత అస్సలు బాగుండదు. తాను రాసిన ఒక కాగితాన్ని కొంతకాలం తరువాత చిరంజీవికి ఇచ్చి చదవమంటే తన రాతను తానే చదవలేడు అన్న విషయం చిరంజీవికి సంబంధించిన అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలిసిన విషయం. దీనితో తన చేతిరాతను బాగుచేసుకోవాలని చిరంజీవి ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తుంటాడట. అయితే తనకు నటనలో పద్మభూషణ వచ్చింది కానీ తన చేతిరాత ఇప్పటికీ మారలేదు అంటూ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు. 
ఆయన స్థాయి పెంచాయి
చిరంజీవికి అబాకస్‌, సుడోకు లాంటి పజిల్ గేమ్స్ తో పాటు చెస్ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడు తన భార్య సురేఖతో ఈ గేమ్స్ ఆడుతూ ఉంటాడని అతడి సన్నిహితులు చెపుతూ ఉంటారు. ప్రస్తుతం చిరంజీవి పారితోషికం సుమారు 30 కోట్ల స్థాయిలో ఉంటే 1978 లో విడుదలైన చిరంజీవి ‘పునాది రాళ్లు' సినిమా కోసం ఆసినిమా నిర్మాతలు ఇచ్చిన పారితోషికం 1,116 రూపాయలు మాత్రమే. సిల్వర్ స్క్రీన్ పై తన డాన్స్ లతో షేక్ చేసే చిరంజీవి తాను ఒక పాట చిత్రీకరణ కోసం షూటింగ్ కు వెళుతున్నప్పుడు తీయబోయే ఆపాటను ప్లే చేసుకుంటూ తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి అద్దం ముందు నుంచుని ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఆ స్టెప్స్ పై తన భార్య సురేఖ అభిప్రాయం తీసుకునే అలవాటు ఇప్పటికీ తనకు ఉందని ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాను ప్రమోట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పాడు. 63 సంవత్సరాల వయస్సులో యక్క్షన్ సీన్స్ చేస్తూ ఇప్పటికీ సినిమాలలో నటిస్తున్న చిరంజీవి కీర్తి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: