మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా మొదలుపెట్టిన సైరా నరసింహారెడ్డి సినిమా సంచలనాలకు సిద్ధమైంది. ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ముందు రోజే సైరా టీజర్ ను రిలీజ్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రికార్డుల చెడుగుడు ఆడేస్తుంది.


నిన్న ఉదయం 11:30 గంటలకు రిలీజ్ అయిన సైరా టీజర్ ఇంకా 24 గంటలు గడవక ముందే 7 మిలియన్స్ వ్యూస్ కు దగ్గరగా ఉంది. గంటలోనే 11 లక్షల వ్యూస్ తో సంచలనంగా మారిన సైరా ఒక్క రోజులో బీభత్సమైన రికార్డులు సృష్టించింది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి అదరగొట్టారు.


వయసు మీద పడుతున్నా ఏమాత్రం అది ముఖంలో కనిపించకుండా స్టార్ హీరోలకు ధీటుగా తన వీరత్వం చూపించేందుకు వస్తున్నాడు ఈ నరసింహా రెడ్డి. ఈ సినిమా టీజరే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి రికార్డులను తుడిచిపెట్టే సినిమాగా సైరా టీజర్ సూపర్ అనేస్తున్నారు.


సినిమాలో అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతిలు కూడా నటిస్తున్నారు. చిరంజీవి 12 ఏళ్ల కలని నిజం చేసేందుకు రాం చరణ్ చేస్తున్న ఈ సైరా మెగా ఫ్యాన్స్ అందరి అంచనాలకు తగినట్టుగా ఉంటుందని తెలుస్తుంది. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: